Panchumarthi Anuradha : నా గెలుపు చంద్రబాబు, లోకేశ్‌లకు అంకితం- పంచుమర్తి అనురాధ
తన గెలుపుని చంద్రబాబు, లోకేశ్ లకు అంకితం చేశారామె. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేశ్ లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.(Panchumarthi Anuradha)

Panchumarthi Anuradha : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఫలితాలు అధికార వైసీపీకి మరింత షాక్ ఇచ్చాయి. అసలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. దాని నుంచి కోలుకోక ముందే మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ధైర్యంగా అభ్యర్థిని నిలిపి గెలిపించుకున్నారు చంద్రబాబు. ఈ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుందని చెప్పాలి. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడం విశేషం. రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురు పోగా కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది.(Panchumarthi Anuradha)
వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై పంచుమర్తి అనురాధ స్పందించారు. తన గెలుపుని చంద్రబాబు, లోకేశ్ లకు అంకితం చేశారామె. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేశ్ లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే
” మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చారు. అందుకు అనుబంధంగా మళ్ళీ టీడీపీకి అవకాశం కల్పించారు. 23 ఓట్లతో టీడీపీకి పట్టం కట్టారు. 23వ తారీకు 2023 సంవత్సరం 23 ఓట్లతో గెలిపించారు. ఇదే స్క్రిప్ట్ అంటే. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీని ఓడించారు.
ప్రలోభాలు, ఒత్తిళ్లు, దౌర్జన్యానికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ. ఒత్తిళ్లకు గురి చేసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అంటూ సజ్జల మాట్లాడిన మాటలు చూస్తే నవ్వొస్తుంది. రాబోయే రోజుల్లో మరింత మార్పు రాష్ట్రంలో రాబోతోంది.”
Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు
నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే
” జగన్ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సొంత పార్టీ నేతలే బాయ్ బాయ్ జగన్ అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వసనీయతను సీఎం కోల్పోయారు. మూడేళ్లలో ప్రజలను, ఎమ్మెల్యేలను జగన్ భయపెట్టారు. అహర్నిశలు కృషి చేసి టీడీపీని గెలిపించారు”.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ రేపాయి. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా… 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు.
వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్ (22 ఓట్లు), ఏసురత్నం (22), పోతుల సునీత (22), సూర్యనారాయణరాజు (22), మర్రి రాజశేఖర్ (22) గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో… రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ అంతిమ విజయం సాధించారు. వెంకటరమణ ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు.(Panchumarthi Anuradha)