Andhra Pradesh : ఏసుక్రీస్తులా చనిపోయి సమాధి నుంచి బతికి వస్తానంటూ సమాధి సిద్ధం చేసుకున్న పాస్టర్

ఏసుక్రీస్తులా చనిపోయి సమాధి నుంచి బతికి వస్తానంటూ సమాధి సిద్ధం చేసుకున్నాడు ఓ పాస్టర్. దీని కోసం ఓ గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు.

Andhra Pradesh :  ఏసుక్రీస్తులా చనిపోయి సమాధి నుంచి బతికి వస్తానంటూ సమాధి సిద్ధం చేసుకున్న పాస్టర్

Pastor's Strange antics in Gannavaram Krishna district

Andhra Pradesh : ఏసుక్రీస్తు చనిపోయి మూడవ రోజున సమాధిని గెలిచి బ్రతికి వచ్చాడని క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ చెబుతోంది. కానీ అది మానవులకు సాధ్యమా? అంటూ సాధ్యమేనంటున్నాడు ఓ పాస్టర్. చనిపోయి సమాధి నుంచి ప్రాణాలతో బ్రతికి వస్తానంటున్నాడు. చనిపోవటానికి సమాధిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దానికి కోసం ఊరంతా పోస్టర్లు ఏర్పాటు చేశాడు.10 రోజుల్లో చనిపోయి సమాధి నుంచి ప్రాణాలతో తిరిగి వస్తానంటూ పోస్టర్లు వేయించాడు. ఊరంతా వాటిని ప్రచారం చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు పాస్టర్ కు కౌన్సెలింగ్ చేశారు. మతి స్థిమితం సరిగా లేకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు పోలీసులు. కానీ ఇది దైవ కార్యం దేవుడే నన్న బ్రతికిస్తాడు అంటున్నాడు సరదు పాస్టర్.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లిలో నాగభూషణం అనే వ్యక్తి పాస్టర్ గా పనిచేస్తున్నాడు. సొంతగా ఓ చర్చి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో తాను సమాధి అవుతానని ఏసుక్రీస్తులాగా తిరిగి బ్రతికి వస్తానంటూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, పరలోకానికి రమ్మంటున్నాడని చెబుతున్నాడు.

అంతేకాదు సమాధి అవ్వటానికి ఓ గొయ్యి తీసాడు. ఆ గొయ్యిలో తనను పూడ్చివేస్తే, దేవుడు మూడ్రోజుల్లో లేచి తిరిగొచ్చినట్టుగా..తాను కూడా లేచి వస్తానని చెబుతున్నాడు సియోను బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ చర్చి నిర్వహిస్తున్న నాగభూషణం. దీని కోసం తన చర్చిలోనే ఓ గొయ్యి తవ్వించాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాగభూషణానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తన పంతం వీడను అంటున్నాడు. సమాధి అయి తీరుతాను..తిరిగి జీవించి వస్తానంటున్నాడు.

దేవుడు లేడని..స్వర్గం, నరకం లేవని..ఆత్మలు ఉండవనే వారికి కనువిప్పు కలిగించేందుకే తాను సమాధి అయి తిరిగి జీవిస్తానని చెబుతున్నాడు పాస్టర్ నాగభూషణం. దీంతో స్థానికులు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు పాస్టర్ కు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. . గత పది రోజుల నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడని పాస్టర్ నాగభూషణం కుటుంబ సభ్యులు వాపోయారు.