వ్యక్తిగత లాభం కోసం పార్టీ పెట్టలేదు : నెలకి రూ.కోటి వస్తే సినిమాలు చేయను

వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 01:16 PM IST
వ్యక్తిగత లాభం కోసం పార్టీ పెట్టలేదు : నెలకి రూ.కోటి వస్తే సినిమాలు చేయను

వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్

వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమాజహితం కోసం ఎన్ని దెబ్బలు తినేందుకైనా సిద్ధపడే పార్టీ పెట్టానన్నారు. జన సైనికులు, ఆడపడుచుల దీవెనలే బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేశాయన్నారు. పార్టీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో లేదో కూడా తెలియదని.. కాపలా కూర్చొనే రాజకీయాలు చేయనని చెప్పారు. పార్టీలో ఉండాలని ఎవరినీ బలవంత పెట్టనని.. భావజాలం ఉన్న వ్యక్తులే జనసేనలో ఉంటారని అన్నారు. 

* విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ సమావేశం
* వ్యక్తిగత లాభం చూసుకుంటే పార్టీ పెట్టేవాడిని కాదు
* జనసేనకు యువత, ఆడపడుచులే బలం
* ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్నారో లేదో తెలియదు

* పార్టీలో ఉండాలని ఎవరినీ బలవంతపెట్టను
* పార్టీ వీడుతూ నాపై విమర్శలు చేస్తున్నారు
* విమర్శలు చేసే వాళ్లు సమాజం కోసం రూ.వెయ్యి వదులుకోగలరా?
* నాపై ఆధారపడ్డ వారి కోసమే సినిమాలు చేస్తున్నా

* నెలకు రూ.కోటి వచ్చి.. వేల కోట్ల ఆస్తి ఉంటే సినిమాలు చేయను
* వేరే పార్టీకి ఓటేసిన వారికి ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు
* ఒక్క చాన్స్ అని అడిగారని ఇస్తే.. రాష్ట్రం కుదేలైంది