Pawan Kalyan: జగన్‌పై జనసేనాని మరోసారి ఫైర్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేనాని మరోసారి ఫైర్ అయ్యారు. రెండ్రోజుల క్రిందట రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌కు వచ్చి సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై కామెంట్లు

Pawan Kalyan: జగన్‌పై జనసేనాని మరోసారి ఫైర్

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేనాని మరోసారి ఫైర్ అయ్యారు. రెండ్రోజుల క్రిందట రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌కు వచ్చి సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై కామెంట్లు చేసిన పవన్.. ఈ సారి ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు.

తాజాగా అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు అమలుకావడం లేదంటూ ఫొటో రూపంలో పోస్టు చేశారు. మద్యపాన నిషేధం, ఉద్యోగాల భర్తీ, కరెంటు చార్జీలు, రాజధాని అంశం ఇలా వాగ్ధానాలన్నింటినీ ప్రస్తావిస్తూ అందులో రాసుకొచ్చారు. ఈ వాగ్దానాలన్నింటినీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని ఏ ఒక్కదాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.

రాష్ట్రాన్ని దాదాపు 4లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందని ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చాక చేపట్టిన చర్యలపై ట్విట్టర్‌ ద్వారా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీకి భిన్నంగా పాలన సాగుతోందని విమర్శించారు.

…………………………….. : పవన్ కళ్యాణ్‌పై పోసాని ఫైర్..

మద్యం ఆదాయాన్ని బ్యాంకుల నుంచి రుణాలను తీసుకునేందుకు ఉపయోగించుకుంటోందని, కరెంట్ చార్జీలను తగ్గిస్తామని.. ట్రూ అప్ ద్వారా అదనపు భారాన్ని మోపుతుందన్నారు. ఏటా 6వేల500 పోలీసు ఉద్యోగాలను నోటిఫై చేస్తామని ఇప్పటిదాకా 450 ఖాళీలను మాత్రమే గుర్తించిందని.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను కూడా 36కు పరిమితం చేసిందని, జాబ్‌ క్యాలెండర్‌, ఇసుక ధరలు, సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాల అమలుపై విమర్శలు గుప్పించారు.