కాకినాడకు పవన్ : ఎమ్మెల్యే అభిమానుల దాడిలో గాయపడ్డ జనసైనికులకు పరామర్శ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 11:35 AM IST
కాకినాడకు పవన్ : ఎమ్మెల్యే అభిమానుల దాడిలో గాయపడ్డ జనసైనికులకు పరామర్శ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ ఆరా తీయనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.

ఆదివారం(జనవరి 12,2020) ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్.. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్వారంపూడి వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి ర్యాలీగా ద్వారంపూడి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, ద్వారంపూడి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ద్వారంపూడి అభిమానులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ నాయకులను వైసీపీ నేతలు వెంటాడి మరీ కొట్టారని.. ఇదంతా పోలీసుల ఎదుటే జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపించారు.

జనసేన నేతలపై పోలీసులు కేసులు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. 307 వంటి హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెడితే.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి తేల్చుకుంటానని పవన్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. 307 మినహా మిగిలిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జనసేనాని స్పందన కోసం నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఘర్షణ అనంతరం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత పూచికత్తుపై కొంతమందిని విడుదల చేశారు.