తిరుపతిలో పోటీకి పవన్ ఆసక్తి, బీజేపీతో కీలక చర్చలు

  • Published By: naveen ,Published On : November 25, 2020 / 05:45 PM IST
తిరుపతిలో పోటీకి పవన్ ఆసక్తి, బీజేపీతో కీలక చర్చలు

pawan kalyan tirupati ticket: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తిరుపతి సీటుపై నడ్డాతో చర్చిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారు. అయితే అక్కడ తమ అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ చెబుతోంది. దీనిపై చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గినందున తమకు తిరుపతి సీటు వదలాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. తిరుపతిలో జనసేనకు మంచి కేడర్ ఉందని, తిరుపతిలో జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నారు. అయితే తిరుపతిలో తామే పోటీ చేస్తామని బీజేపీ కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది.

ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. రెండు రోజులుగా జేపీ నడ్డా అపాయింట్ మెంట్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. చివరికి అపాయింట్ మెంట్ దొరికింది. జేపీ నడ్డా అధికారిక నివాసం 7బి జన్ పథ్ లో జేపీ నడ్డాతో పవన్ సమావేశం అయ్యారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తిరుపతి సీటుపై జేపీ నడ్డాతో పవన్ చర్చిస్తున్నారు.

ఈ మీటింగ్ లో ఏపీలోని రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలన గురించి జేపీ నడ్డాకు పవన్ వివరించనున్నారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం అంశంపైనా ఈ భేటీ తర్వాత ఓ క్లారిటీ రానుంది.

తిరుపతిలో జనసేన కేడర్, ఓటు బ్యాంకు బలంగా ఉన్నాయి. కాపు సామాజికవర్గం అండగా ఉంది. గత ఎన్నికల్లో జనసేకు మెరుగైన ఓట్లు వచ్చాయి. గతంలో చిరంజీవి అక్కడి నుంచి గెలుపొండదం జరిగింది. పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఉంది. మద్దతు కూడా ఉంది. ఇవన్నీ జనసేనకు ప్లస్ అవుతాయని, మెజార్టీ గెలుపు అవకాశాలు జనసేకు ఉంటాయి కనుక, ఆ స్థానాన్ని తమకు వదలాలని ప్రధానంగా పవన్ కోరబోతున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటారా లేదా అన్నదానికి సంబంధించి ఈ మీటింగ్ లో ఓ క్లారిటీ ఉంటుంది.

బీజేపీ మాత్రం తిరుపతి స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా గడిచిన రెండు రోజులుగా తిరుపతిలోని స్థానిక అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. అక్కడ బలమైన కేడర్ ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో తామే పోటీ చెయ్యాలని బీజేపీ భావిస్తోంది. వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమే, జనసేనకు టికెట్ వదిలితే కనుక అది మైనస్ అవుతుందనే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాతే కేంద్ర నాయకత్వం తిరుపతి సీటుపై ఓ నిర్ణయం తీసుకోనుంది.