భరించడానికి మేం టీడీపీ వాళ్లం కాదు.. చిల్లరగా మాట్లాడొద్దు: పవన్ కళ్యాణ్

  • Edited By: vamsi , November 12, 2019 / 12:19 PM IST
భరించడానికి మేం టీడీపీ వాళ్లం కాదు.. చిల్లరగా మాట్లాడొద్దు: పవన్ కళ్యాణ్

జగన్ రెడ్డి వైసీపీ నాయకుడులా చిల్లరగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం గుర్తు పెట్టుకుని హుందాగా మాట్లాడాలని అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ఎలానో చిల్లరగా మాట్లాడారు మీ స్థాయి అది. మేము అలా మాట్లాడలేము. మా తల్లదండ్రులు మాకు సంస్కారం నేర్పించారు.

మీరు భాషా సంస్కారాలను మర్చిపోయి ఎంత హీన స్థితిలో మాట్లాడినా మేము కచ్చితంగా పాలసీ విధానాల పైనే స్పందిస్తాము అని అన్నారు. విజయవాడ నడి బొడ్డున కూర్చుని చెప్తున్న మీ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదు అని అన్నారు పవన్ కళ్యాణ్. ఎలాబడితే అలా మాట్లాడకండి. చాలా గట్టిగా సమాధానం చెబుతాం అంటూ వైసీపీకి వార్నాంగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

మీరు ఎలా మాట్లాడినా భరించడానికి మేం తెలుగుదేశం వాళ్లం కాదు.. బలంగా స్పందిస్తాం అని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. మీరు ఏది అన్నా కూడా తెలుగుదేశం వాళ్లు పడుతారేమో కానీ, మేం పడే ప్రసక్తే లేదని అన్నారు పవన్ కళ్యాణ్.