Pawan Kalyan : టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి..

Pawan Kalyan : టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది

Pawan Kalyan Ttd

Pawan Kalyan : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 2010లో టీటీడీ 4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని.. ఆ విధంగానే సొసైటీలు ఏర్పాటయ్యాయని పవన్‌ గుర్తు చేశారు. మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

”4వేల మంది టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది. తీవ్ర ఆందోళనలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. 2010లో టీటీడీలో సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకు? కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం… నిధులు దారి మళ్లించేందుకేనా? బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా?
వైసీపీ ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. 4వేల మంది ఉద్యోగులకు మద్దతు కల్పించాలన్న ఉద్దేశ్యం వైసీపీకి లేదు. వారికి పాదయాత్రలో హామీలు ఇచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

FB Own Survey : ఫేస్‌బుక్‌‌తో 36 కోట్ల మందికి రిస్క్!

ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల విలీనం లాగే ఇప్పుడు టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదుకు లాగుతోందని పవన్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ గా మార్చాలనుకుంటోందని ధ్వజమెత్తారు. ఇది ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే పని చేస్తున్న రెగ్యులర్ కార్మికులకు, ఒప్పంద కార్మికులకు కానీ ఒకే వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్ లో చేరని వారిని ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని, ఇది అన్యాయం అని అన్నారు. నిధులు దారి మళ్లించేందుకే ప్రభుత్వం కొత్తగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తోందని పవన్ ఆరోపించారు.