Nadendla Manohar: ముడేళ్ళలో అనంతపురం జిల్లాలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

మంగళవారం సాయంత్రం మన్నిల గ్రామంలో రచ్చబండ నిర్వహించి..ఆత్మహత్యలు చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో పాల్గొననున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Nadendla Manohar: ముడేళ్ళలో అనంతపురం జిల్లాలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

Manohar

Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, అధికార వైకాపా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్..వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ముడేళ్ళల్లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మనోహర్ తెలిపారు. అనుకోని పరిస్థితుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షలు ఇవ్వాల్సి ఉండగా..మూడు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ చెబుతున్న రైతు భరోసా పథకం..ఓసీలకు వర్తించడం లేదని మనోహర్ విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం..నేడు జనసేనాని పర్యటన ఖరారు కావడంతో..ఆర్థిక సహాయం చేస్తామంటూ స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

Also read:GVL Narasimharao: కొత్త మంత్రులంతా ఉత్తుత్తి మంత్రులే: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

కౌలు రైతుల ఆత్మహత్యల నివారణ కోసం 2011లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం రూ.7 లక్షలు ఇవ్వాలని..కౌలు రైతుల ఆత్మహత్యలపై చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల బాధలను స్వయంగా చూసిన పవన్ కళ్యాణ్, రూ. ఐదు కోట్లతో ఆయా కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారని మనోహర్ తెలిపారు. గడిచిన ముడేళ్ళల్లో అనంతపురం జిల్లాలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని..తమ బాధ్యతగా ఉమ్మడి అనంతపురం జిల్లాలలో 28 మంది బాధిత కుటుంబాలకు రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు.

Also read: Balineni Srinivasa Reddy : మంత్రి పదవి కోసం ఎప్పుడూ వెంపర్లాడ లేదు

కౌలు రైతుల ఆత్మహత్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు అనంతపురం, సత్యసాయి జిల్లాలలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం మన్నిల గ్రామంలో రచ్చబండ నిర్వహించి..ఆత్మహత్యలు చేసుకొన్న కౌలు రైతుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో పాల్గొననున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆశించిన ఫలితం రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొందరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని..ఆయా కుటుంబాలకు అండగా నిలబడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కుటుంబాలను జనసేన తరుపున ఆదుకుంటామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కల్యాణ్ టూర్ తో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మనోహర్ అన్నారు.

Also read:Kottu Satyanarayana : టీడీపీ, బీజేపీకి మత రాజకీయాలు అలవాటు- మంత్రి కొట్టు సత్యనారాయణ