నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటన..రైతులను పరామర్శించనున్న పవన్

  • Published By: bheemraj ,Published On : December 2, 2020 / 07:51 AM IST
నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని పర్యటన..రైతులను పరామర్శించనున్న పవన్

pawan kalyan Nivar cyclone affected areas : నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో తుపాను బాధితుల కడగండ్లను తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి పర్యటన చేపట్టనున్నారు. నివార్ తుపాన్ కారణంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి.. వారి కష్టాలను స్వయంగా పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని రైతులను పవన్‌ పరామర్శించనున్నారు.



ఇవాళ ఉయ్యూరు చేరుకోనున్న పవన్‌.. అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు.



https://10tv.in/the-accused-revealed-during-the-police-investigation-that-the-minister-had-deliberately-attempted-murder-on-perninani/
ఇక చిత్తూరు జిల్లాలో రేపు పవన్ పర్యటిస్తారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న నష్టాలపై జనసేన నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు.