Pawan Kalyan : వారికి మాత్రమే చోటు, జనసేన నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. పని చేసే వారికే పార్టీలో చోటు ఉంటుందని తేల్చి చెప్పారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలన్నారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan : వారికి మాత్రమే చోటు, జనసేన నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan Kalyan : మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు కొనసాగిన మీటింగ్ లో జనసేన నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు. పని చేసే వారికే పార్టీలో చోటు ఉంటుందని తేల్చి చెప్పారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలన్నారు పవన్ కల్యాణ్. నేతలు, కార్యకర్తలు ఉద్యమాల్లో చురుక్కుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటు విశాఖ ఘటన కేసు ఎదుర్కొంటున్న వారికి ధైర్యం చెప్పారు పవన్.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. కొన్ని వారాలుగా జరుగుతున్న సంఘటనలు, రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు కూడా హాజరయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, పవన్ నిన్న మంగళగిరిలో విశాఖ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఇటీవల హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన 9 మంది నేతలను, వారి కుటుంబ సభ్యులను పవన్ కలుసుకున్నారు. నేతలకు పవన్ ఆత్మీయ సత్కారం చేశారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు పవన్.