మీరెవరూ ఇక్కడ ఉండరు.. పవన్ వార్నింగ్ : జగన్ వస్తే ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని అప్పుడే చెప్పా

కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన కార్యకర్తలపై అకారణంగా దాడి చేశారని మండిపడ్డారు. మీరు బూతులు తిట్టి,

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 11:59 AM IST
మీరెవరూ ఇక్కడ ఉండరు.. పవన్ వార్నింగ్ : జగన్ వస్తే ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని అప్పుడే చెప్పా

కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన కార్యకర్తలపై అకారణంగా దాడి చేశారని మండిపడ్డారు. మీరు బూతులు తిట్టి,

కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన కార్యకర్తలపై దాడి దురదృష్టకరమన్నారు. అకారణంగా మా వాళ్లపై దాడి చేశారని మండిపడ్డారు. మీరు బూతులు తిట్టి, దాడి చేసి.. మా వాళ్లపై కేసులు పెడతారా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఖరిని పవన్ తప్పుపట్టారు. ఎమ్మెల్యే ద్వారంపూడి వాడిన భాష దారుణం అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి వాడకూడని భాష ఉపయోగించారని సీరియస్ అయ్యారు. రెచ్చగొట్టాలి, శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలనుకుంటే మీరెవరూ ఇక్కడ ఉండలేరని పవన్ వార్నింగ్ ఇచ్చారు. 

వైసీపీ నేతల మాటలు క్షమించరానివి అని పవన్ అన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా సహనం చేతకాని తనం కాదన్నారు. బాధ్యతగల వ్యక్తిని కాబట్టే నేను పద్దతిగా మాట్లాడుతున్నా అని చెప్పారు. నేను ఒక్క మాట మాట్లాడకపోయినా ఇంత దారుణమైన భాష ఉపయోగిస్తారా అని పవన్ మండిపడ్డారు. వైసీపీ గెలిస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని గతంలోనే చెప్పానని పవన్ గుర్తు చేశారు. కాకినాడ ఘటన ఆఖరిది కావాలన్నారు పవన్. ఇంకొక్క ఘటన జరిగితే చేతులు కట్టుకుని కూర్చోమని పవన్ వార్నింగ్ ఇచ్చారు. దాడులు చేస్తే తిరగబడతామన్నారు.

వైసీపీ ప్రజాప్రతినిధులు అకారణంగా గొడవలు సృష్టించారని పవన్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులై ఉండి ఇంత దారుణంగా మాట్లాడతారా అని సీరియస్ అయ్యారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం శోచనీయం అన్నారు. మంగళవారం(జనవరి 14,2020) కాకినాడ వెళ్లిన పవన్.. ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల దాడిలో గాయపడిన జనసేన నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. పార్టీ నేత పంతం నానాజీ ఇంటికెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు. 

* అధికార మదం ఎక్కి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు
* పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి వైసీపీ ప్రయత్నించింది
* భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కుండా పోలీసులు, ప్రభుత్వం బాధ్యత వహించాలి
* ఇలాంటి భాష మాట్లాడటం ఇదే చివరిసారి కావాలి
* మాపై దాడులు చేసిన వారిపై కేసులు పెట్టాలి
* మా దగ్గర వీడియో రికార్డులు ఉన్నాయి.. వాటితో గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం

* ఈ పరిస్థితికి కారణమైన ఇద్దరు పోలీసులు అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి
* 151మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీరేమైనా దొగిచ్చినట్లా
* మేము అయ్యా అని మాట్లాడితే.. ఒరే, తురే అంటున్నారు
* మాపై దాడులు చేస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవడం క్షమించరానిది
* నిరసన తెలిపే హక్కు మాకు లేదా
* పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం.. బాధ్యతగా వ్యవహరించండి
* బలం ఉంది కాబట్టే సంయమనంతో ఉన్నాం
* గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదు

* కాకినాడ ఘటన ఆఖరిది కావాలి
* ఇంకొక్క సంఘటన జరిగితే చేతులు కట్టుకుని కూర్చోము
* జనసైనికులపై దాడి దురదృష్టకరం
* పచ్చిబూతులు తిట్టి.. దాడులు చేస్తే.. పోలీసులు చోద్యం చూడటం సరికాదు
* జనసైనికులపై దాడిని పోలీసులు సుమోటోగా తీసుకుని విచారించాలి
* ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తాం అంటే ప్రజలు సహించరు

Also Read : సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారు