Pawan Kalyan Janasena 10th Formation Day : జనసేన ఆవిర్భావ సభలో ఎన్నికల ఎజెండాను ప్రకటించనున్న జనసేనాని పవన్

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం (బందరు)లో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ఎజెండాను ప్రకటించనున్నారు.

Pawan Kalyan Janasena 10th Formation Day : జనసేన ఆవిర్భావ సభలో ఎన్నికల ఎజెండాను ప్రకటించనున్న జనసేనాని పవన్

Pawan Kalyan Janasena 10th formation day

Pawan Kalyan Janasena 10th formation day : ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం (బందరు)లో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే విజయవాడలోని ఆటోనగర్ నుంచి ‘వారాహి’వాహనంలో మచిలీపట్నానికి పయనమయ్యారు పవన్ కల్యాణ్. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్,పామర్రు గుడివాడ సెంటర్, గూడూరు సెంటర్ మీదుగా పవన్ టూర్ కొనసాగుతోంది. సాయంత్రం గంటలకు పవన్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సభా వేదిక నుంచి ఎన్నికల ఎజెండాను పవన్ ప్రకటించనున్నారు. ఈ సభపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు అధికారపార్టీ,ఇటు ప్రతిపక్ష పార్టీలు పవన్ ప్రసంగం కోసం వేచి చూస్తున్నారు.

వైసీపీ ఓటు చీలనివ్వనని ఇప్పటికే పవన్ పలుమార్లు ప్రకటించారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా పవన్ అడుడులు వేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడతానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండటంతో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టీడీపీతో పవన్ పొత్తులు పెట్టుకుంటే తాము పవన్ తో కలిసేది లేదని ఒంటరిగానే పోటీ చేస్తామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ తో పొత్తుల విషయంలో అటు టీడీపీ, ఇటు బీజేపీ ఓ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.

10ఏళ్ల క్రితం పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో పెను మార్పులు రావాలని..పారదర్శకంగా పాలన ఉండాలని చెబుతున్నారు. దీని కోసం జనసేన పనిచేస్తుందని తెలిపారు. 2014లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీకి మద్దతిచ్చినా, 2019లో ఒంటరిగా బరిలోకి దిగి భారీగా దెబ్బతిన్నా..2024 కోసం ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న దానిపైనా పవన్ అస్పష్టంగానే కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కానీ నేను మాత్రం క్లారిటీగానే ఉన్నాను రాజకీయాల్లో మార్పుకావాలంటే సిద్ధంగా మీరు ఉన్నారా? అంటూ పవన్ ప్రజలను ప్రశ్నిస్తున్నారు.

ఇలా పొత్తులపై కూడా పనవ్ త్వరలోనే క్లారిటీకి వస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బందరులో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేసిన క్రమంలో జన సైనికులు,‌ పవన్ అభిమానులు దాదాపు 2 లక్షల మంది పైగా వస్తారని అంచనా. పవన్ రాకే ఓ అద్భుతమని భావిస్తుంటే..మరోపక్క వారాహి వాహనం చూసేందుకు జనాలు పోటీ పడుతున్నారు. ఫోటోలతో హల్ చల్ చేయటానికి జనాలు రెడీగా సభా ప్రాంగణం వద్ద..పవన్ టూర్ పొడవునా జనాలు పోటీ పడుతున్నారు.