ఆస్తి ఇవ్వకపోతే చచ్చిపోండి..తల్లిదండ్రులను వేధిస్తున్న మహిళా కానిస్టేబుల్

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 02:32 PM IST
ఆస్తి ఇవ్వకపోతే చచ్చిపోండి..తల్లిదండ్రులను వేధిస్తున్న మహిళా కానిస్టేబుల్

ఆస్తి ఇవ్వకపోతే చచ్చిపోండి..సంపాదించిన ఆస్తి వయస్సు ఉడిగిపోయాక ఏం చేసుకుంటారు..మీద వేసుకుని ఛస్తారా? అంటూ కడుపున పుట్టిన కూతురి వేధింపులకు తల్లడిల్లిపోతున్నారా వృద్ధ తల్లిదండ్రులు. భర్తతో కలిసి కన్నవారిని వేధిస్తున్న కూతురిని ఏమనాలో..తెలిక ఇటువంటి బిడ్డనా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది అంటూ అల్లాడిపోతున్నారా అమ్మానాన్నలు.



వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా అనే మహిళ తన భర్తతోకలిసి తల్లిదండ్రులను ఆస్తి కోసం వేధిస్తోంది. ఆస్తి రాసివ్వకపోతే చావండి..అంటూ పురుగుల మందు డబ్బా పట్టుకొచ్చి తల్లిందండ్రులకిచ్చింది. ఈ వయస్సులో ఆస్తి నాకివ్వకుండా ఏం చేసుకుంటారు? మీద వేసుకుని ఛస్తారా? అంటూ భర్తతో కలిసి కన్న తల్లిదండ్రులకు నిత్యం నరకం చూపిస్తోంది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ తల్లిదండ్రులు పెదకాకాని పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు.



ఆస్తి కోసం నా కూతురు ఫాతిమా అల్లుడు పెడుతున్న చిత్రహింసలు భరించలేకపోతున్నామని..పురుగుల మందు పట్టుకొచ్చి ఇది తాగి చావండీ..మీ చచ్చాక అయినా ఆస్తి మాదైవుతుంది అంటూ వేధిస్తున్నారనీ వాపోతూ..దయచేసిన మాకు వారి నుంచి కాపాడండి అంటూ ప్రాధేయపడ్డారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే తల్లిదండ్రులను వేధిస్తున్న ఫాతిమా పెదకాకాని పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ గా పనిచేస్తోంది.