Perni Nani: కొడాలి నాని.. గడ్డంతో రుద్రాక్షలు వేసుకుని రౌడీలా కనిపిస్తాడు.. కానీ

నోట్లో కిళ్లీ వేసుకుంటాడు కదా అని ఆయన్ని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. కానీ ఐదోసారి గెలవడానికి, ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించడానికి కావాల్సిన స్కెచ్ కొడాలి ఇప్పటికే వేశారు అంటూ పేర్ని నాని అన్నారు.

Perni Nani: కొడాలి నాని.. గడ్డంతో రుద్రాక్షలు వేసుకుని రౌడీలా కనిపిస్తాడు.. కానీ

Perni nani, kodali nani

Perni Nani: కొడాలి నాని గడ్డం‌పై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొడాలి నాని.. గడ్డంతో రుద్రాక్షలు వేసుకుని రౌడీలా కనిపిస్తాడు. కానీ రాష్ట్రంలో అత్యంత తెలివైన రాజకీయనేత‌ల్లో ఆయన ఒకరు. పైకి ఏమీ తెలియని వాడిలా ఉంటాడు, కానీ ఆయన బుర్ర పాదరసంలా పనిచేస్తుందని అన్నారు. నోట్లో కిళ్లీ వేసుకుంటాడు కదా అని ఆయన్ని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. కానీ ఐదోసారి గెలవడానికి, ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించడానికి కావాల్సిన స్కెచ్ కొడాలి ఇప్పటికే వేశారు అంటూ పేర్ని నాని అన్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ పెట్టారు. చంద్రబాబుకు మేలు చెయ్యడమే పవన్ కల్యాణ్‌కు ముఖ్యం అంటూ ఎద్దేవా చేశారు.

Kodali Nani : రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోద్దా? చినుకు పడితే హైదరాబాద్‌లో పడవలు తిరుగుతున్నాయి-హరీశ్ రావుకి కొడాలి నాని కౌంటర్

కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో రూ.8.98 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ డిపో (RTC Depot) గ్యారేజ్‌ను మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన ముఖ్యమంత్రి జగన్.. ఆ శాఖకు ఊపిరి పోశారు. ఊళ్ళో ఎక్కడ వర్షం వచ్చినా గతంలో గుడివాడ డిపో గ్యారేజీ వర్షంలో మోకాలు లోతు మునిగేది. గుడివాడ బస్ డిపో గ్యారేజీ‌ని బాగుచేశారు కొడాలి నాని. సంవత్సరానికి 3600 కోట్ల జీతాల భారాన్ని మోసి ప్రభుత్వం‌లో కలిపారు. 7300 కోట్లు అప్పులో ఉన్న ఆర్టీసీ‌ని లాభాల బాట పట్టించేలా సీఎం జగన్ ప్రణాళికలు చేశారు. 3000 కోట్ల వరకూ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉండేది. ఏపీఎస్ఆర్టీసీ అప్పులు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికీ ప్రైవేటుపరం కాదు‌.‌ పది కోట్లతో గుడివాడ బస్టాండు నిర్మాణానికి టెండర్ పిలవబోతున్నాం. మే 19న సీఎం జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేస్తామని అన్నారు.

Bandi Sanjay: నేను సచివాలయం కూలుస్తానని అనలేదు.. పునర్ నిర్మిస్తాం అంటున్నాం ..

ఆర్టీసీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లోఉన్న గుడివాడ(Gudivada) డిపో నిర్మాణానికి సహకరించిన మాజీ మంత్రి పేర్ని నాని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కొడాలి నాని అన్నారు. మే 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10కోట్లతో గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. ఇప్పుడు మాటలు చెబుతున్నా టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు. చంద్రబాబు తు తూ మంత్రంగా టిడ్కో ఫ్లాట్లు నిర్మిస్తే.. జగన్ హయాంలో పూర్తి స్థాయి మౌలిక వసతులతో నిర్మాణం పూర్తి చేసుకుంది.

Perni Nani : ఏపీని తిట్టిన మంత్రి తరపున కిరాయి మాటలు మాట్లాడుతావా? పవన్‌పై పేర్ని నాని ఫైర్

గుడివాడ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 1300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కేవలం నాలుగేళ్లలో ఇంత అభివృద్ధి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ముఖ్యమంత్రులుగా వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డిలు తప్ప పేదల ఇళ్ల స్థలాల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి కప్పుకుంటా. దీర్ఘ కాలిక, భవిష్యత్ అవసరాల సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ నిరంతరం అనుకుంటారు. ప్రజలను గాలికి వదిలేసి పాలన చేసిన, గాలి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో కొడాలి నాని (Kodali Nani) విమర్శలు చేశారు.