Petrol Price : వామ్మో.. గుంటూరు, విజయవాడలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచాయి. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 చొప్పున పెరిగింది.

Petrol Price : వామ్మో.. గుంటూరు, విజయవాడలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

Petrol Price

Petrol Price : దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా 15వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై 19 పైసల నుంచి 30 పైసలు వరకు పెంచాయి. దీంతో మొత్తం 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 చొప్పున పెరిగింది.

తాజాగా పెరిగిన ధరలతో విజయవాడ, గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 100.15… డీజిల్ ధర రూ. 94.44గా ఉంది. ప్రీమియం పెట్రోల్ ధర రూ. 103.58కి చేరింది. మరోవైపు విజయవాడలో పెట్రోల్ ధర రూ. 100.11… డీజిల్ ధర రూ. 94.54గా ఉంది. విజయవాడలో లీటరు ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.103.38గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 97.63… డీజిల్ ధర రూ. 92.54కి చేరుకుంది.

15వ రోజూ పెంచిన ధరలతో దేశంలోని కొన్ని చోట్ల లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100లు దాటేసింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరగడంతో.. పెట్రోల్‌ ధర రూ.93.94లు, డీజిల్‌ ధర రూ.84.89లుగా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.19లుగా ఉండగా.. డీజిల్ ధర రూ.92.17గా ఉంది.

వాహనదారులకు చమురు కంపెనీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరాయి ఇంధన ధరలు. ఇంకా పెరుగుతూ పోతుంటడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే వాహనాలు బయటకు తియ్యడం కష్టమే అంటున్నారు.

పెట్రోల్‌పై రూ.3.61.. డీజిల్‌పై రూ.4.11 పెంపు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోల్‌ ధరలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 2న వెలువడగా.. ఆ తర్వాత రోజు నుంచి ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత నెలలో ముడి చమురు ఖరీదైన తర్వాత సైతం పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరగలేదు. అయితే, ముడి చమురు రేట్లు తగ్గిన అనంతరం పెట్రోల్‌, డీజిల్‌పై నాలుగుసార్లు తగ్గించారు. దీంతో పెట్రోల్‌ లీటర్‌కు 77 పైసలు, డీజిల్‌పై 74 పైసలు వరకు తగ్గించాయి. ఈ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వరుసగా, రోజు విడిచి రోజు చమురు కంపెనీలు ధరలను పెంచుతూ వస్తున్నాయి.

ఇప్పటివరకు 15 సార్లు ధరలు పెరగ్గా.. లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.61, డీజిల్‌పై రూ.4.11 పెంచాయి. ఇదిలా ఉండగా.. ఒపెక్‌ దేశాల మంత్రివర్గ సమావేశం జూన్‌ 1న జరగనుంది. జూలైలో ముడి చమురు ఉత్పత్తిని పెంచుతారనే ఊహాగానాలున్నాయి. దీంతో ముడి చమురు మార్కెట్ ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగాయి.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.94.. డీజిల్‌ 84.89
ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.19.. డీజిల్‌ రూ.92.17
చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.95.51.. డీజిల్‌ రూ.89.65
కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.97.. డీజిల్‌ రూ.87.74
భోపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.04.. డీజిల్‌ 93.37
రాంచీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.90.62.. డీజిల్‌ రూ.89.64
బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.07.. డీజిల్‌ రూ.89.99
పాట్నాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.10.. డీజిల్‌ రూ.90.16
చండీగఢ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.90.36, డీజిల్‌ రూ.84.55
లక్నోలో లీటర్‌ పెట్రోల్‌ రూ.91.41.. డీజిల్‌ రూ.85.28
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.63, డీజి‌ల్‌ రూ.92.54