Kadapa : ఫార్మసీ విద్యార్ధిని అనుమానాస్పద మృతి

కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Kadapa : ఫార్మసీ విద్యార్ధిని అనుమానాస్పద మృతి

suicide

Kadapa :  కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పోరుమామిళ్ల మండలం నాగల కుంట్లకు చెందిన సుజాత అనే విద్యార్ధిని నాలుగు రోజుల క్రితమే హాస్టల్ లో చేరింది.  ఈరోజు ఉదయం హాస్టల్ సిబ్బంది  మీ కుమార్తె  ఆత్మహత్య చేసుకుందని  తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు.  హస్టల్ కు వచ్చిన తల్లితండ్రులు తమ కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పలు విద్యార్ధి సంఘాలు హాస్టల్ వద్దకు వచ్చి  చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేశాయి.  విద్యార్థినిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపణలు చేశారు. విద్యార్థి మృతి వెనుక గల కారణాలు తెలుసుకోవాలని, నిర్లక్ష్యం వ్యహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.