వైద్యుల నిర్లక్ష్యానికి కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి.. బెడ్ పై నుంచి పడి మహిళా, బాత్ రూమ్ లో పడి మరో బాధితుడు మృతి

  • Published By: bheemraj ,Published On : July 22, 2020 / 12:38 AM IST
వైద్యుల నిర్లక్ష్యానికి కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి.. బెడ్ పై నుంచి పడి మహిళా, బాత్ రూమ్ లో పడి మరో బాధితుడు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందారు. బెడ్ పై నుంచి కింద పడి ఓ మహిళా పేషెంట్ మృతి చెందింది. బాత్ రూమ్ లో పడి మరో కరోనా బాధితుడు చనిపోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ విషాధ ఘటనలు జరిగాయి. అయినా ఆస్పత్రి సిబ్బంది మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఇద్దరిదీ సహజ మరణమే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

కోవిడ్ ఆస్పత్రికి బతకడం కోసం ట్రీమ్ మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్లు గానీ అక్కడున్న స్టాఫ్ గానీ స్పందిస్తున్న తీరు సరిగ్గా లేకపోవడంతో మృతి చెందుతున్నారనేది ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తోంది. ముఖ్యంగా మంగళవారం (జులై 21, 2020) విజయలక్ష్మీ అనే మహిళ బెడ్ పై నుంచి కింద పడి కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్లుగానే మృతి చెందింది. అదే విధంగా బాపిరాజు అనే వ్యక్తి బాత్ రూమ్ లోకి వెళ్లి అక్కడ పడిపోయి మృతి చెందాడు.

పడి పోయినా తర్వాత కూడా పైపు వదిలి నీరు కారుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సాయం చేయడానికి అనేక మంది ఉంటారు కానీ ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు. డాక్టర్లు గానీ, సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని కోవిడ్ పాజిటివ్ రోగులు చెబుతునాన్నారు. సరైన వాటర్ అందించడం లేదని చెబుతున్నారు.

డాక్టర్లు చెబుతున్నది ఇంకొక వెర్షన్ లో ఉంది. పలమరీ ఎంబాలిజం అనేది రావడం వల్ల గుండె సడెన్ గా గుండె లెయిల్ పోయింది. బ్లేడ్ అంతా క్లాట్ అయిపోవడంతో నడస్తున్న వారు కూడా క్షణాల్లో మృతి చెందుతున్నన్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే కోవిడ్ పేషెంట్లకు పలిమరీ అంబాలిజమనేది సడెన్ గా వస్తుందనేది డాక్టర్ల వైపు నుంచి వస్తున్న వెర్షన్. ప్రతి రోజు ముగ్గురు, నలుగురు చనిపోతున్నారు.

కానీ ఈ విధంగా ఒకరు బాత్ రూమ్ లో, మరొకరు బెడ్ పై నుంచి పడి చనిపోవడం అనేది హృదయవిదారకం అని చెప్పుకోవచ్చు. వారం రోజుల క్రితం ఈ విధానం జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో జరుగుతుందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆకస్మిక తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో లోపల జరిగే ట్రీట్ మెంట్ విషయంలో గానీ వాళ్లు ఇస్తున్న సదుపాయాలలో గానీ ఏమైన తేడా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కానీ పరిస్థుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు రోజులకు ఒకసారి డాక్టర్లు వస్తారని విమర్శలు కురిపిస్తున్నాయి. అక్కడున్న రోగులను కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో జరిగిన రెండు మృతులు కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. అందరూ కోవిడ్ రోగి కావడంతో సాయం చేయలేదని పరిస్థితి నెలకొంది.