ప్రేమను కాదన్నందుకు : యువతి హత్యకు ప్లాన్ వేసి బుక్కయ్యాడు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 04:50 AM IST
ప్రేమను కాదన్నందుకు : యువతి హత్యకు ప్లాన్ వేసి బుక్కయ్యాడు

ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడం లేదనే కారణంతో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీసేస్తున్నారు. ఇతరులకు డబ్బులు ఇచ్చి..హత్యకు ప్లాన్ వేస్తున్నారు. ఇలాగే ప్రేమించలేదనే కారణంతో యువతిని చంపేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. ప్రస్తుతం ఇతనితో పాటు..మరికొంత మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

వెస్ట్ గోదావరి జిల్లాలోని ఎం.నాగులాపల్లికి చెందిన యువతిని ప్రేమ పేరిట వేధిస్తున్నాడు సత్యదేవ్ అనే యువకుడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామంటూ యువతిపై తీవ్ర ఒత్తిడి చేసేవాడు. దీనికి..యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. విషయాన్ని స్నేహితులకు చెప్పాడు. తన ప్రేమను నిరాకరించిన యువతిని భూమి మీద లేకుండా చేద్దామని చెప్పాడు. స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్ రచించాడు.

ఏలూరుకు చెందిన కొత్తపల్లి సురేష్ తో కలిసి రూ. 3 లక్షల సుపారి కుదరింది. అడ్వాన్స్ కింద రూ. 40 వేలు తీసుకుంటున్న క్రమంలో..పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు నిందితులను ద్వారకా తిరుమల పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.(భార్యకు కరోనా వచ్చిందని వాహనాలను కాల్చేశాడు)