PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.

PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..

Alluri Sitaramaraji

PM Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప‌ర్య‌టించ‌నున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు.

భీమవరంలో క్షత్రియ సేవాసమితి 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

ఆజాదీ కా అమ్రుత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతిని పురస్కరించుకొని అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గానూ మోదీ విచ్చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా వచ్చిన ఢిల్లీ నుంచి రెండ్రోజుల ముందు వచ్చిన మోదీ.. భీమవరం పర్యటన వివరాలిలా ఉన్నాయి.

Read Also: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

* ఉదయం 10 గంటల 10 నిముషాలకు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

* 10గంటల 15నిమిషాలకి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భీమవరం వెళ్తారు.

* 10 గంటల 55 నిముషాలకు భీమవరం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

* అనంతరం సభా ప్రాంగణానికి చేరుకోని దాదాపు 1 గంట 15 నిముషాలు విగ్రహావిష్కరణ, సభ వద్ద మోదీ గడపనున్నారు.

* మధ్యాహ్నం 12 గంటల 25 నిముషాలకు భీమవరం నుంచి ప్రత్యేక హెలిప్యాడ్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

* మధ్యాహ్నం 1 గంట 10 నిముషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.