Maoist Celebrations : మావోయిస్టు వారోత్సవాలు..తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్

మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏవోబీలో అడుగడుగునా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది.

Maoist Celebrations : మావోయిస్టు వారోత్సవాలు..తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్

Maoist

Maoist celebrations : మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏవోబీలో అడుగడుగునా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది.

ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పట్టణాలకు తరలివెళ్లారు. అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా తమ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. దీంతో ఆగస్టు 3 వరకు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.

Maoists: శాంతి చర్చలకు సిద్ధం.. కానీ: మావోయిస్టులు

తెలంగాణలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో హై అలర్ట్‌ కొనసాగుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు, కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతాలకు సమీపంలోని ములుగు జిల్లా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

వెంకటాపురం- భద్రాచలం, వాజేడు -ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారిపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. ములుగు జిల్లాలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలు….ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు , వెంకటాపురం మండలాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి.