బంగారు నాణెలు ఊరికేరావు : అక్షయపాత్ర పేరుతో ఘరానా మోసం

ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 08:21 AM IST
బంగారు నాణెలు ఊరికేరావు : అక్షయపాత్ర పేరుతో ఘరానా మోసం

ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల

ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల రూపాయల వసూలు చేసి నకిలీ బంగారు నాణాలు అంటగడతారు. ఇక్కడే చిన్న డ్రామా ప్లే చేస్తారు. సరిగ్గా అక్షయపాత్ర ఇచ్చే సమయానికి సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్టు నాటకమాడి తుర్రుమంటారు. అక్షయపాత్ర ఉందంటూ ప్రచారం చేసుకుంటూ నమ్మిన వారిని నట్టేట ముంచుతున్నారు. ఈ బ్యాచ్‌ ఆగడాలు ఇటీవల చిత్తూరు జిల్లాలో ఎక్కువయ్యాయి.

చిత్తూరు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ బంగారు ముఠాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న పలమనేరు పోలీసు సబ్‌ డవిజన్‌లో ఇలాంటి ముఠాల జోరు ఎక్కువైంది. అమాయకులను టార్గెట్‌ చేసి అసలు బంగారు నాణేలు చూపిస్తూ నకిలీవి అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నారు. వీరి వలలో చిక్కి ఎందరో అమాయకులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇలా మోసాలు చేస్తున్న కర్నాటక ముఠా.. చిత్తూరు జిల్లాలో పట్టుబడింది.

సత్యవేడుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి ఎర వేసింది ఈ ముఠా. తమ దగ్గర అక్షయపాత్ర ఉందని నమ్మించింది. దాన్ని అమ్ముతామని నమ్మించింది. అయితే దాన్ని కొనేందుకు తటపటాయించడంతో.. ముందుగా అక్షయపాత్రగా చెబుతున్న చెంబు నుంచి రెండు నాణెలను ఇచ్చి పరీక్షించుకోమని చెప్పింది. ఆ నాణాలను తీసుకున్న సుబ్రహ్మణ్యం మార్కెట్‌లో వాటిని పరిశీలించి అవి నిజమైనవే అని నిర్దారించుకున్నాడు. తిరిగి వారి దగ్గరికి వెళ్లి మొత్తం నాణాలను కొంటానని వారితో చెప్పాడు. రూ.5 లక్షలకు బేరం కూడా కుదిరింది. డబ్బులు చేతికి అందిన వెంటనే.. ఆ చెంబును సుబ్రహ్మణ్యానికి అందజేసింది ముఠా. అయితే ఇక్కడే పెద్ద డ్రామా ఆడి తప్పించుకున్నారు కిలాడీ గ్యాంగ్‌ సభ్యులు.

కరెక్టుగా సుబ్రహ్మణ్యం ఆ పాత్రను తీసుకొని నాణాలను చెక్‌ చేసుకుందామనే సమయానికి పోలీస్‌ విజిల్‌ మోగింది. పోలీసులు వస్తున్నారని పారిపోవాలంటూ సుబ్రహ్మణ్యంను అక్కడి నుంచి పంపించివేశారు ముఠా సభ్యులు. డబ్బులు తీసుకొని వారు ఉడాయించారు. అక్కడి నుంచి బయటపడ్డ సుబ్రహ్మణ్యం చెంబులోని నాణాలను చూసి అవి నకిలీవని అర్ధమై అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా సమాచారం ప్రకారం కర్నాటక గ్యాంగ్‌ను పట్టుకున్నారు. మునివెంకటప్ప, నారాయణప్ప, చిన్నప్పయ్య, రవూఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ ఇత్తడి చెంబు, 900 గ్రాముల నకిలీ బంగారు నాణాలతో పాటు.. నాలుగు లక్షల నగదు, రెండు బంగారు నాణాలు, పోలీసులు వాడే విజిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇలా చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. అత్యాశకు పోతే ఇలా అసలుకే మోసం వస్తుందని అంటున్నారు పోలీసులు. ఇలాంటి వారి మాయగాళ్ల వలకు చిక్కొద్దని హెచ్చరిస్తున్నారు.