టీడీపీ కీలక నేతలు అరెస్ట్.. అమరావతిలో టెన్షన్, టెన్షన్

అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం

టీడీపీ కీలక నేతలు అరెస్ట్.. అమరావతిలో టెన్షన్, టెన్షన్

అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం

అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం అయ్యాక అమరావతి ప్రాంతంలో కరకట్ట దగ్గర టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రజావేదిక కూల్చివేతకు నేటికి(జూన్ 25,2020) ఏడాది. ఈ సందర్భంగా ప్రజావేదిక ప్రదేశాన్ని మరోసారి పరిశీలించాలని నిర్ణయించిన టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో కరకట్ట దాని పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ఇది అన్యాయం అన్న టీడీపీ నేతలు:
కరకట్ట దగ్గర ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయమై పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. తమను ఎందుకు వెళ్లనివ్వడం లేదని టీడీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గాన్ని కూడా పోలీసులు బ్లాక్ చేశారు. కరకట్ట దగ్గర టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, తెనాలి శ్రవణ్‌కుమార్‌, నక్కా ఆనంద్ బాబులను అడ్డుకున్న పోలీసులు వారిని వెనక్కు పంపించారు. అయినా టీడీపీ నేతలు తగ్గకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇది అప్రజాస్వామికం అన్నారు. తాము చంద్రబాబు ఇంటికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కరోనా నిబంధలు తమకు తెలుసని.. తమ అధినేత ఇంటికి వెళ్లనివ్వరా అని ఫైర్ అయ్యారు.

ప్రజావేదిక అక్రమ కట్టడం అంటూ కూల్చివేత:
నిబంధనలను ఉల్లంఘించి ప్రజా వేదికను నిర్మించారని కలెక్టర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ అప్పట్లో ప్రకటించారు. అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశం నుండే జగన్ అధికారులను ఆదేశించారు. ఈ భవనాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాసినా సీఎం జగన్ నుంచి ఎలాంటి సమాధానం రాని విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అక్రమంగా ఈ భవనాన్ని నిర్మిస్తే అదే భవనంలో ఎందుకు సమావేశం పెట్టారో చెప్పాలని టీడీపీ నేతలు గతంలో ప్రశ్నించారు. ప్రజా వేదిక నిర్మాణానికి సీఆర్‌డీఏ అనుమతి కూడా లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమే అని ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్దతిలో నిర్మించినందున దాన్ని కూల్చకుండా వేరే ఎక్కడైనా ఏర్పాటు చేయండని టీడీపీ శ్రేణులు కోరినా అక్రమ కట్టడాల కూల్చివేతలన్నీ ఇక్కడి నుండే ప్రారంభిస్తామని తేల్చి చెప్పిన జగన్.. ప్రజావేదిక కూల్చి వేయించారు.

ప్రజావేదిక కూల్చి ఏడాది దాటినా శిథిలాలు అక్కడే:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనువుగా ఉంటుందని, గ్రీవెన్స్ హాల్ గా ప్రజావేదిక పేరుతో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు తన నివాసం పక్కనే దీన్ని నిర్మించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఇది అక్రమ కట్టడం అని చెబుతూ దీన్ని కూల్చేశారు. ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది పూర్తయింది. సంవత్సర కాలం గడిచినా అక్కడి స్క్రాప్‌ను(శిథిలాలు) మాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. దీంతో ప్రజావేదిక ప్రదేశాన్ని మరోసారి పరిశీలించేందుకు టీడీపీ నేతలు యత్నించారు.

Read: నోరు మూసుకొనే కన్నా..చావడం మిన్న PVP Tweet