Private Hospitals : 10టీవీ వరుస కథనాలతో కరోనా బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై కేసులు

కరోనా ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి. 10 టీవి కథనాలను ఆధారంగా తీసుకుని తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు.

Private Hospitals : 10టీవీ వరుస కథనాలతో కరోనా బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై కేసులు

Private Hospitals

police Cases against private hospitals : కరోనా ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి. వాటిపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. వెంటనే వాటిపై ప్రత్యేక నిఘా పెట్టింది. 10 టీవి కథనాలను ఆధారంగా తీసుకుని తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. జిల్లాల్లోని పోలీసు యాంత్రాంగం స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతోంది. కరోనా బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై వరుస కేసులు నమోదు చేస్తోంది.

కర్నూలు లోని శ్రీగాయత్రి, అనంతపురంలోని ఎస్వీ ఆస్పత్రి యాజమాన్యాలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కోవిడ్‌ పేషెంట్ల నుంచి అడ్డగోలుగా దోచేస్తున్నారన్న ఆస్పత్రులు, కరోనా బాధితుల ముక్కు పిండి వసూలు చేస్తున్న ఆస్పత్రులపై 10టీవీ ఫోకస్‌ పెట్టడంతో.. కార్పోరేట్‌ ఆస్పత్రుల బాగోతాలు బట్టబయలయ్యాయి. దీంతో ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు.

అనంతపురంలోని ఎస్వీ ఆస్పత్రిపైనా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. కరోనా పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలడంతో.. ఆసుపత్రి మేనేజింగ్ పార్టనర్ రవిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్వీ ఆసుపత్రిలో కరోనా బాధితుల నుంచి అధిక డబ్బు వసూలు చేసినట్లు విజిలిన్స్‌ దాలుల్లో తేలిందని.. కరోనా వేళ తక్కువ బెడ్స్ అనుమతి తీసుకుని ఎక్కువ మంది.. కరోన పేషెంట్స్ చేర్చుకున్నట్లు తనిఖీల్లో బయటపడిందని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తప్పవని.. రెమ్‌డిసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

విజయనగరంలోని క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిపైనా పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లలో గోల్‌మాల్‌కు పాల్పడినట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో తేలడంతో.. హాస్పిటల్ డైరెక్టర్ రమేశ్‌ కుమార్, డాక్టర్ వివేక్‌లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వన్ టౌన్ స్టేషన్‌లో నిందితుల్ని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.