TDP MLC Vehicles Diversion : ఏపీ శాసన మండలి ముగిశాక నాటకీయ పరిణామాలు.. టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలు దారి మళ్లింపు

ఏపీ శాసన మండలి ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారా లోకేశ్‌ సహా టీడీపీ ఎమ్మెల్సీల వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. రోజూ వెళ్లే దారిలో కాకుండా మరో దారిలో ఇంటికి పంపించడం హాట్‌ టాపిక్‌ అయింది.

TDP MLC Vehicles Diversion : ఏపీ శాసన మండలి ముగిశాక నాటకీయ పరిణామాలు.. టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలు దారి మళ్లింపు

TDP MLC vehicles Diversion

TDP MLC Vehicles Diversion : ఏపీ శాసన మండలి ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారా లోకేశ్‌ సహా టీడీపీ ఎమ్మెల్సీల వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. రోజూ వెళ్లే దారిలో కాకుండా మరో దారిలో ఇంటికి పంపించడం హాట్‌ టాపిక్‌ అయింది. టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లే దారిలోనే మూడు రాజధానులకు మద్దతుగా కొంతమంది శిబిరం ఏర్పాటు చేశారు. ఆ శిబిరానికి ఇవాళ చాలామంది చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిపై దాడి జరుగుతుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో పోలీసులు ముందుజాగ్రత్తగా టీడీపీ ఎమ్మెల్సీల కాన్వాయ్‌ను దారి మళ్లించారు. నిత్యం వెళ్లే రూట్‌లో కాకుండా వెంకటపాలెం మీదుగా ఇంటికి పంపించారు. ఎమ్మెల్సీల వాహనాలు వెళ్లేదాకా మందడం- సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును దిగ్బంధించి.. వారికి భద్రత కల్పించారు.

Kolagatla Veerabhadra Swamy : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభ నుంచి టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. వ్యవసాయంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టబట్టారు. స్పీకరం పోడియం వద్దకు దూసెళ్లి ఆందోళన చేపట్టారు.

వ్యవసాయంపై చర్చకు ఎల్లుండి అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పారు. కానీ టీడీపీ సభ్యులు వినకుండా అలాగే ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో సభ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. గొడవ చేస్తూ సభకు అడ్డుపడటం సరికాదని వైసీసీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.