Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
అమలాపురంలో అల్లర్లను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా 46 మందిపై(Konaseema Violence)

Konaseema Violence : కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా 46 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఆ 46 మందిపై పలు సెక్లన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మరింత మందిపైనా కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు సాగుతున్నారు. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో బీజేపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచందర్ రావు కుమారుడు అజయ్ ఉన్నారు.(Konaseema Violence)

Amalapuram
* ఆందోళనకారులపై 307, 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188, 353 r/w 149 IPC, 3, 4 PDPPA, 32 PA-1861 సెక్షన్ల కింద కేసు నమోదు.
* సామర్లకోటకి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు నమోదు
* వజ్ర వెహికల్ లో గత రెండేళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం
* కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్‌పై కేసు
* బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
* కోనసీమలో విధ్వంసంపై మరో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం.(Konaseema Violence)
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Konaseema
46 మందిపై పోలీసు కేసు..
నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, థింక్ యాడ్ సావుకారు, దున్నల దిలీప్, అడప శివ, అసెట్టి గుడ్డు, చిక్కల మధుబాబు, దువ్వ నరేశ్, లింగోలు సతీశ్, నల్ల నాయుడు, నక్క హరి, కిశోర్, దొమ్మేటి బబ్లూ, నల్ల పృథ్థి, మోకా సుబ్బారావు, ఐళ్ల నాగ వెంకట దుర్గా నాయుడు, అడప సత్తిబాబు, నల్ల రాంబాబు, యెళ్ల రాధ, గాలిదేవర నరసింహ మూర్తి, సమసాని రమేశ్, కడలి విజయ్, తోట గణెశ్, అన్యం సాయి, దూలం సునీల్, కలవకొలను సతీశ్, కనిపుడి రమేశ్, ఎదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పొలిశెట్టి కిశోర్, నల్ల కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మడిశెట్టి ప్రసాద్, వినయ్(కలవకొలను స్ట్రీట్), శివ(Ganapathi Lodge), సదనాల మురళి, నల్ల అజయ్, వాకపల్లి మణికంఠ, కసిన పణీంద్ర, కొండేటి ఈశ్వర రావ్, అరిగెల తేజ, అరిగెల వెంకట రామారావు, రాయుడు స్వామి.

Amalapuram Violence
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. పలు రాజకీయ పార్టీలు కూడా ఇదే వాదనను వినిపించాయి.(Konaseema Violence)
Konaseema Tension : అమలాపురంలో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు
ఈ క్రమంలో జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాల కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తున్న మరో వర్గం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇది ఊహించని విధంగా అల్లర్లకు దారితీసింది. ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు.(Konaseema Violence)

Amalapuram Tension
అంతేకాదు మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పొన్నాడ సతీశ్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మూడు బస్సులను దగ్ధం చేశారు. దీంతో ప్రశాంతతకు మారుపేరు అయిన కోనసీమ ఒక్కసారిగా భగ్గుమంది. జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం అల్లర్లు, విధ్వంసాలతో అట్టుడికింది. రణరంగాన్ని తలపించింది. అమలాపురం అల్లర్ల వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది.
- Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం
- Pawan Kalyan On Konaseema : కోనసీమ వివాదం రాజకీయ కుట్ర, అమిత్ షాకు లేఖ రాస్తాం-పవన్ కళ్యాణ్
- Konaseema Internet : మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్.. 91మంది అరెస్ట్
- KONASEEMA : కోనసీమలో అసలు ఏ జరిగింది..? ఏం జరగబోతోంది..? పచ్చని సీమలో చిచ్చు రగిల్చింది ఎవరు?
- Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్‌నగర్‌లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?