Nara Lokesh : యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు షాక్..!

చిత్తూరు జిల్లా పలమనేరు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేయటం వివాదాస్పదంగా మారింది. వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు.

Nara Lokesh : యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు షాక్..!

Nara Lokesh : చిత్తూరు జిల్లా పలమనేరు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ప్రచార వాహనాన్ని పోలీసులు సీజ్ చేయటం వివాదాస్పదంగా మారింది. వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. పాదయాత్రలో లోకేశ్ ఎక్కువగా ప్రజలు ఏర్పాటు చేసిన వేదికలు, రోడ్ సైడ్ సమావేశాల్లో స్టూల్ పైనుంచి ప్రసంగిస్తున్నారు. జనం ఎక్కువగా ఉన్న చోట్ల ప్రచార రథం పైనుంచి మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా ప్రచార రథంపై ప్రసంగించారు. ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు పలమనేరు డీఎస్పీ. దీంతో టీడీపీ నేతలు డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ 7వ రోజు. కాగా, ఇవాళ్టి రోజు యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండానే వాహనాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల చర్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(Nara Lokesh)

Also Read..Janasena : కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించట్లేదు..? : పవన్ కల్యాణ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ 7వ రోజు. కాగా, ఇవాళ్టి రోజు యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండానే వాహనాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల చర్యలను టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read..Phone Tapping In YCP : ముగ్గురు వచ్చారు,వెళ్లారు ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చారు : అధిష్టానంపై YCP MLA ఆనం సెటైర్లు

పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్ గా నారా లోకేశ్ నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని లోకేశ్ అన్నారు. అందరినీ ఉద్ధరిస్తానంటూ జగన్ చెబితే అందరూ నమ్మారని.. ఉద్యోగాలు ఇస్తానని, 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానంటే మురిసిపోయారని.. 151 సీట్లతో జగన్ కు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేక పోయారని విమర్శించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జగన్ తయారు చేస్తున్న కల్తీ లిక్కర్.. పురుగు మందు కంటే బాగా పని చేస్తోందన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పారు. మోదీ వస్తే కాళ్లు పట్టుకోవడానికి రెడీగా ఉన్నారని అన్నారు. సీబీఐ అధికారులు వస్తే జగన్ కాళ్లు వణికిపోతున్నాయని, ప్యాంటు తడిచిపోతోందని అన్నారు. 25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్.. కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు లోకేశ్.