Girl Safe : తూర్పుగోదావరి జిల్లాలో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ వెంటనే డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతి కాకినాడలో ఉందని తెలుసుకున్నారు.

Girl Safe : తూర్పుగోదావరి జిల్లాలో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Missing

Girl Safe : తూర్పుగోదావరి జిల్లాలో మిస్సింగ్ కేసు కథ ముగిసింది. పిఠాపురంలో అదృశ్యమైన యువతి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆరు బృందాలతో మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించారు. యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. 24 గంటల్లోనే కేసు క్లోజ్ చేశారు.

పిఠాపురంకు చెందిన డిగ్రీ విద్యార్థిని హాల్‌ టికెట్‌ కోసమని కాలేజీకి వెళ్లింది. అలా వెళ్లిన యువతి మళ్లీ ఇంటికి చేరుకోలేదు. హాల్‌ టికెట్ కోసమని ఆటోలో బయల్దేరిన యువతి.. తనకు ఆటో డ్రైవర్‌పై అనుమానం ఉన్నట్టు ఫ్రెండ్‌కి మెసేజ్‌ చేసింది. ఆ తర్వాత కాసేపటికే యువతి ఫోన్‌ స్విచాఫ్‌ అవడంతో పేరెంట్స్‌ ఆందోళన చెందారు.

Hyderabad : యువతి అదృశ్యం.. స్నేహితులను కలిసేందుకు వెళ్లి.. తిరిగి ఇంటికి రాలేదు

స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు వెంటనే డీఎస్పీ స్థాయి అధికారితో నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో యువతి కాకినాడలో ఉందని తెలుసుకున్నారు. అందుకు సంబంధించి కాకినాడ బస్టాండ్‌లో యువతి తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

అయితే పరీక్షలు దగ్గర పడడంతో మానసిక ఒత్తిడికి గురై.. యువతి ఇలా ప్రవర్తించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కావాలనే ఆటోలో వెళ్తున్నట్లు.. తనను కిడ్నాప్ చేస్తున్నట్లు క్రియేట్ చేసిందని చెప్పారు. టెక్నాలజీ సాయంతో యువతిని గుర్తించి.. తల్లిదండ్రులను అప్పగించామని పోలీసులు చెప్పారు.