Chandrababu : విశాఖ రుషికొండ వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Chandrababu : విశాఖ రుషికొండ వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

Chandrababu : విశాఖ రుషికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ భూములను పరిశీలించడానికి వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు. హైవేపైనే బాబు కాన్వాయ్‌ను నిలిపివేశారు. బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రుషికొండ భూములను పరిశీలించాలని భావించారు.

అంతకుముందు సీఎం జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. ఏపీని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని టీడీపీ ప్రయత్నిస్తే.. జగన్‌ నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్‌ జే బ్రాండ్‌, గంజాయి, డ్రగ్స్‌కు ఏపీని కేరాఫ్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు.

Chandra Babu Naidu : అధికారంలోకి రావటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న చంద్రబాబు

దాదాపు 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు ఎవరు కట్టాలని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు వేశారని పేర్కొన్నారు. జగన్‌ది ఐరన్‌లెగ్‌ అన్న చంద్రబాబు.. అతను ఉన్నంతవరకూ ఏ పరిశ్రమా రాదని కామెంట్‌ చేశారు.