జయరామ్ హత్యకేసు : రాకేశ్ రెడ్డితోపాటు శ్రిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు 

పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణలో రాజకీయ పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 05:12 AM IST
జయరామ్ హత్యకేసు : రాకేశ్ రెడ్డితోపాటు శ్రిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు 

పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణలో రాజకీయ పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి.

కృష్ణా : పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణలో రాజకీయ పరిణామాలు చేటుచేసుకుంటున్నాయి. ఎంసీఎల్ గెస్ట్ హౌస్ లో రాకేశ్ రెడ్డితోపాటు శ్రిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్నారు. నందిగామ్ రూరల్ పోలీస్ స్టేషన్ కు డీఎస్పీ బోస్ చేరుకున్నారు. నిందితుడు రాకేశ్ రెడ్డిని మీడియా ముందు ప్రవేవపెట్టాలా.. లేక కోర్టులో ప్రవేశపెట్టాలా అన్న అంశంపై పోలీసులు చర్చిస్తున్నారు.

అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. కంచికచర్ల పీఎస్ నుంచి శ్రిఖా చౌదరిని పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. అర్ధరాత్రి 1.10 గంటల సమయంలో వీధి లైట్లు ఆఫ్ చేసి శ్రిఖా చౌదరిని కారులో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రాంతంలో శ్రిఖా చౌదరిని ఉంచారు. అయితే శ్రిఖా చౌదరిని హైదరాబాద్ కు ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై స్పష్టత కొరవడింది.