Woman Raped : గుంటూరు మహిళ సామూహిక అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు

గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో జాగీలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.

Woman Raped : గుంటూరు మహిళ సామూహిక అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు

Rape

Police investigation woman raped : గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో జాగీలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన స్థలంలో గుంటూరు జిల్లా క్లూస్ టీమ్ వివరాలను సేకరించింది. ఘటనా స్థలిని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.

సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహ వేడుకకు హాజరై బైక్ పై తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద బైక్ పై వస్తున్న దంపతులను దుండగులు అడ్డగించి, వారిపై దాడికి దిగారు. అనంతరం వివాహితను సమీపంలోని పంట పొలాల్లోకి లాక్కెళ్లారు. కత్తులతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

బాధిత మహిళ అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాదని గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. తమ స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉందని పోలీసులు అన్నారు. దీంతో బాధితులు మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులపై విమర్శలు చేశారు. సత్తెనపల్లి పోలీసులపై విమర్శలలు వెల్లువెత్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం తామే స్వయంగా అక్కడికి పంపినట్లు చెబుతున్నారు.