Gunturu : రెండు కోట్ల విలువైన వస్తువులున్న లారీని ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్

రెండు కోట్ల రూపాయలు విలువైన వస్తువులున్న లారీని దొంగిలించిన కేసులో గుంటూరు జిల్లా పోలీసులు 24 గంటల్లోనే దొంగను పట్టుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.

Gunturu : రెండు కోట్ల విలువైన వస్తువులున్న లారీని ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్

Mangalagiri Lorry Theft Case

Gunturu :  రెండు కోట్ల రూపాయలు విలువైన వస్తువులున్న లారీని దొంగిలించిన కేసులో గుంటూరు జిల్లా పోలీసులు 24 గంటల్లోనే దొంగను పట్టుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు.

బ్లూ డార్ట్ కొరియర్ సర్వీసుకు చెందిన లారీ రెండు కోట్ల రూపాయల విలువైన వివిధ వస్తువులతో   చెన్నై నుంచి భువనేశ్వర్ వెళుతోంది. 14వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో లారీ డ్రైవర్లు గుంటూరు జిల్లా కాజ టోల్‌ ప్లాజా సమీపంలోని   దాబా వద్ద లారీని ఆపి భోజనానికి వెళ్లారు. వారు తాళాలు లారీలోనే మర్చిపోయారు.

అదే సమయంలో ప్రకాశం జిల్లా యద్దనపూడికి చెందిన   నాగరాజు అనే దొంగ ఆ లారీ వద్దకు వచ్చాడు.  తాళాలు లారీలోనే ఉండటంతో లారీని ఎత్తుకుపోయాడు. భోజనం చేసి వచ్చిన   డ్రైవర్లకు లారీ కనపడకపోయే సరికి వారు బ్లూ డార్ట్ కంపెనీకి సమాచారం ఇచ్చారు. కొరియర్ కంపెనీ మేనేజర్ శ్రీనివాసరావు వెంటేనే మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ సహాయంతో లారీ అమరావతి వద్ద ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి నాగరాజును అరెస్ట్ చేశారు.  లారీని స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై  గతంలో నాలుగు కేసులున్నాయని అతనిపై సస్పెక్ట్ షీటు కూడా ఉందని మంగళగిరి సీఐ భూషణం తెలిపారు.  నిందితుడికి  లారీలో రెండు కోట్ల రూపాయల విలువైన ల్యాప్ ట్యాప్లు, మెడిసిన్, పాస్ పోర్టులునట్లు తెలియదని… అయితే లారీలు  అపహరించుకు పోయి   టైర్లు అమ్ముకుంటూ ఉంటాడని చెప్పారు.

Also Read : Bunny Vas : నిర్మాత బన్నీ వాసుకు తప్పిన ప్రమాదం