Kidnap in Adoni: అదోని చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం..

Kidnap in Adoni: అదోని చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం..

arrested

Kidnap in Adoni: కర్నూలు జిల్లా అదోనిలో చిన్నారి కిడ్నాప్ కేసును 36గంటల్లోనే చేధించిన పోలీసులు.. ఈ క్రైంకు పాజిటివ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఛాలెంజింగ్ గా తీసుకుని పాపను రక్షించిన పోలీసులకు ఎస్పీ పకీరప్ప కాగినెల్లి రివార్డులు ప్రకటించారు.

రెండ్రోజుల క్రితం స్థానిక వంశీ చైతన్య హాస్పిటల్ లో పాపను కిడ్నాప్ చేశారు దుండగులు. బాధితులు పోలీసులను ఆశ్రయించి పాపను కాపాడాలని మొరపెట్టుకున్నారు. దొరికిన ఆధారాలతో ఎంత గాలించినా ఆచూకీ తెలుసుకోలేకపోయారు. పక్కా ప్లానింగ్ తో జిల్లా ఎస్పీ ఆదేశాలందుకున్న ఇద్దరు డీఎస్పీలు 14 బృందాలుగా ఏర్పడి సీఐలతో కలిసి కేసును చేధించారు.

ఎట్టకేలకు 36గంటల్లోనే పాపను సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కిడ్నాప్ కు పాల్పడిన ఝాన్సీ లక్ష్మీ, ఆమె భర్త మంజూనాథ్ వారికి సహకరించిన హాస్పిటల్ ఆయాలపై క్రిమినల్ కేసులు బుక్ చేశారు. ఈ ప్రక్రియలో పోలీసులకు సహాయపడిన ఇద్దరు ఆటో డ్రైవర్లను జిల్లా ఎస్పీ సన్మానించారు.