భక్తుడికి అశ్లీల వీడియో లింకు : ఎస్వీబీసీ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

  • Published By: bheemraj ,Published On : November 11, 2020 / 09:58 PM IST
భక్తుడికి అశ్లీల వీడియో లింకు : ఎస్వీబీసీ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

SVBC employee Suspend : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. భక్తుడికి అశ్లీల వీడియో లింకు పంపాడని ఎస్వీబీసీ సీఈవో సస్పెండ్ చేశారు. ఎస్వీబీసీలో ఓఎస్‌ఓ( అటెండ‌ర్‌)గా విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగిని బుధ‌వారం (నవంబర్ 11, 2020) విధుల నుండి తొల‌గించారు. మరో నలుగురు ఉద్యోగులు అశ్లీల వీడియోలు చూసినట్లు గుర్తించామని టీటీడీ తెలిపారు. విచారించి వారందరని విధుల నుంచి తొలగిస్తామని చెప్పారు.



ఈ ఏడాది సెప్టెంబ‌రు నెల‌లో వెంక‌ట క్రిష్ణ అనే భ‌క్తుడు శ‌‌త‌మానం భ‌వ‌తి కార్యక్రమానికి సంబందించిన వివ‌రాల‌ను మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి భక్తుడికి అశ్లీల‌ వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భ‌క్తుడు టీటీడీ చైర్మన్‌, ఈవోలకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంపై స్పందించిన‌ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు.



దాదాపు 25 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఎస్వీబీసీ సిఈవో తెలిపారు.