ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్‌-కోవిడ్‌ ట్రీట్‌మెంట్

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 08:11 AM IST
ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్‌-కోవిడ్‌ ట్రీట్‌మెంట్

Post Covid Treatment Under Aarogya Sri : కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కరోనా నుంచి కోలుకున్నవారిలో తలెత్తే దుష్ప్రభవాలకు సంబంధించి ట్రీట్ మెంట్ పొందవచ్చు.



కోవిడ్‌ ట్రీట్ మెంట్ తొలిసారి ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి చికిత్సలందించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సలనూ(కరోనా నుంచి కోలుకున్నాక కలిగే దుష్పరిణామాలు) ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
https://10tv.in/who-created-aarogya-setu-rti-body-pulls-up-government-over-evasive-reply/
శుక్రవారమే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీచేశారు.



అయితే ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా చికిత్సకు ఎంత ధరలు వసూలు చేయాలో స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించామన్నారు.



కరోనా సోకి రెండు వారాల తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి పోస్ట్‌ కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు ఆళ్ల నాని వెల్లడించారు.



* కన్సల్టేషన్‌ చార్జీలు : రూ.400
* పోషకాహారానికి : రూ.200
* వైరస్‌ సోకకుండా డిస్‌ ఇన్ఫెక్షన్‌  : రూ.230
* మందులు, నిర్ధారణ పరీక్షలకు రూ.700
* ఆక్సిజన్, నెబులైజేషన్‌ చార్జీలు రూ.500
* ఆక్సిజన్, సీపాప్, బైపాప్‌తో చికిత్స‌లతో కలిపి రోజుకు రూ.900