కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

  • Published By: srihari ,Published On : May 29, 2020 / 08:40 AM IST
కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం సుహారిక మృతదేహాన్ని కుటుంభ సభ్యులకు అప్పగించారు. సుహారిక కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. వారం, పది రోజుల్లో ప్రాథమిక నివేదికను వైద్యులు రాయదుర్గం పోలీసులకు అందించనున్నారు. 

కన్నా లక్ష్మీనారాయణ రెండో కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక. నిన్న స్నేహితుడి ఇంట్లో  సుహారిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాయదుర్గంలోని స్నేహితుడి ఇంట్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు సుహారిక చనిపోతే సాయంత్రం వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అమానాలకు తావిస్తోంది. పార్టీ జరిగిన ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు.  

స్నేహితురాలి ఇంట్లో సుహారిక స్పృహ తప్పిపడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స కోసం రాయదుర్గంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. 174 సెక్షన్ ప్రకారం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక (38) గురువారం (29 మే 2020) మృతి చెందారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి హిల్‌రిడ్జ్‌ విల్లాస్‌లో నివాసం ఉంటున్న సుహారిక.. ఉదయం స్థానిక మీనాక్షి బాంబూస్‌లోని మిత్రుడు పవన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ వికాస్‌, వివాస్‌, ప్రవీణ్‌ (సుహారిక సోదరి భర్త) తదితరులు కలిసి పార్టీ చేసుకున్నారు.

అయితే ఉదయం 11గంటల 30నిమిషాలకు ఉన్నట్టుండి సుహారిక కుప్పకూలారు. వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీకి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

విషయం తెలుుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టగా.. సాయంత్రం 5.30 గంటలకు మృతురాలి తల్లి మల్లి సాగరిక ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో సుహారిక చనిపోయి ఉంటుందని, ఎలాంటి అనుమానాలు లేవని చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 

Read: కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం.. కోడలు మృతి