కరోనా ఉంది..స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయ్యండి – టీడీపీ

  • Published By: madhu ,Published On : March 7, 2020 / 12:42 AM IST
కరోనా ఉంది..స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయ్యండి – టీడీపీ

ఏపీలో లోకల్ పోరుకు రంగం సిద్ధమైంది.. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది. దీంతో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు నేతలతో హైలెవల్ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. యనమల, కళా, అచ్చెన్నాయుడు, లోకేశ్, వర్ల రామయ్య ఈ కమిటీలో ఉంటారు. ఎన్నికల ప్రక్రియను పార్టీ పరంగా ఈ నేతలు సమన్వయం చేస్తారు. 

జిల్లా నేతలతో సంప్రదింపులు, వ్యూహాలపై ఈ కమిటీ పని చేయనుంది. ఇది కాకుండా ఇతర నేతలతో మరో రాష్ట్ర స్థాయి కమిటీని కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. వీరంతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో అందుబాటులో ఉంటారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పర్యవేక్షణ ద్వారా ఎన్నికల్లో క్యాడర్‌కు సహకారం అందిస్తారు. ఈ మేరకు కమిటీల సభ్యులతో చంద్రబాబు పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఎన్నికల  కార్యారణపై చర్చించారు.

ఓ వైపు ఎన్నికలకు సమాయాత్తం అవుతూనే.. మరోవైపు వాయిదా కోసం ప్రయత్నాలు కూడా చేస్తోంది టీడీపీ. ఇప్పటికే సుప్రీం కోర్టులో రిజర్వేషన్ల అంశంపై టీడీపీ నేతలు పిటిషన్ వేశారు. అయితే దానిపై కోర్టులో విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు పార్టీ బీసీ నేతలు సీఎంకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అయినా ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కనీసం కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని అయినా ఎన్నికలను వాయిదా వెయ్యాలని టీడీపీ కోరింది. ఇక 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే తీవ్ర నష్టం వస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. (కరోనా ఎఫెక్ట్ : బయో మెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పిన కేంద్రం)

ఎన్నికల సంఘం మీటింగ్ లో పాల్గొన్న టీడీపీ నేతలు పలు అంశాలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త చట్టం పేరుతో పోలీసు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను, గ్రామ సచివాలయ ఉద్యోగులను ఉపయోగించవద్దని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

Read More : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు : మద్యం, డబ్బు పంపిణీ చేస్తే..మూడేళ్ల జైలు శిక్ష