Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.

Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

Polavaram project

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే అని తేల్చి చెప్పింది.

పార్లమెంటులో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరాలు వెల్లడించారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి2023కే పూర్తి కావాల్సి ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.

Polavaram Project : మరింత ఆలస్యం.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన

తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైనట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు పేర్కొన్నారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా అందులో కూడా జాప్యం జరిగినట్లు తేల్చి చెప్పారు.