కరోనా వచ్చిందని తినడం ఆపలేదు, చదువెందుకు ఆపాలి.. కలెక్టర్ పోలాభాస్కర్

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 04:17 PM IST
కరోనా వచ్చిందని తినడం ఆపలేదు, చదువెందుకు ఆపాలి.. కలెక్టర్ పోలాభాస్కర్

collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే ఏమీ కాదన్నారు. కొవిడ్ తో 14 ఏళ్ల లోపు పిల్లలు మరణించిన కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు.

విద్యార్థులకు కరోనా సోకితే వారి తల్లిదండ్రులు, తాతలకు సోకే అవకాశం ఉందన్నారు. విద్యార్థులను స్కూల్ కి పంపాలని బలవంతం చేయడం లేదన్న కలెక్టర్.. తల్లిదండ్రులకు ధైర్యం ఉంటేనే వారి పిల్లలను స్కూళ్లకు పంపాలన్నారు. కొవిడ్ నిర్ధారణ వరకు విద్యాశాఖ చూసుకుంటుందని, కొవిడ్ నిర్ధారణ అయితే వైద్యశాఖ చూసుకుంటుందని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు.

పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేగింది. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లిలో 8మంది విద్యార్థులు, ముగ్గురు తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. నెల్లూరు జిల్లాలో 8మంది స్కూల్ టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, రాపూరు మండలాల్లోని స్కూళ్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

* ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు
* చిత్తూరు జిల్లాలో రెండు రోజుల్లో 120మంది టీచర్లకు, 30మంది విద్యార్థులకు కరోనా
* పశ్చిమగోదావరి జిల్లా ఈస్ట్ యడవల్లిలో ప్రభుత్వ స్కూల్ లో కరోనా.. 8మంది విద్యార్థులకు, ముగ్గురు పేరెంట్స్ కు కొవిడ్ పాజిటివ్
* నెల్లూరు జిల్లాలో 8మంది టీచర్లకు కొవిడ్
* సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, రాపూరు మండలాల్లో కేసులు నమోదు
* ప్రకాశం జిల్లాలోని నాలుగు హైస్కూల్స్ లో కరోనా కేసులు
* జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, టీచర్ కు కరోనా
* త్రిపురాంతకం హైస్కూల్ లో టీచర్ కు కొవిడ్ పాజిటివ్
* పీసీపల్లి హైస్కూల్ లో విద్యార్థి, టీచర్ కి కరోనా
* పెద్దగొల్లపల్లి హైస్కూల్ లో టీచర్ కి కరోనా నిర్ధారణ
* ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు