Prathipati Pullarao: అక్కడో రూ.10 వేలు.. ఇక్కడో రూ.10 వేలు ఇచ్చి..: టీడీపీలోని పరిణామాలపై ప్రత్తిపాటి కామెంట్స్

నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు? ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలా? అని ప్రత్తిపాటి అన్నారు.

Prathipati Pullarao: అక్కడో రూ.10 వేలు.. ఇక్కడో రూ.10 వేలు ఇచ్చి..: టీడీపీలోని పరిణామాలపై ప్రత్తిపాటి కామెంట్స్

Prathipati PullaRao

Prathipati Pullarao – TDP: టీడీపీలోని పరిణామాలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది కేవలం హడావుడేనని అన్నారు.

“ఫౌండేషన్లు, ట్రస్టులు పేర్లతో వచ్చే నేతలకు వినోదం పంచితే ఎలా? అక్కడో రూ.10 వేలు.. ఇక్కడో రూ.10 వేలు ఇచ్చి టిక్కెట్లు కావాలంటే ఇచ్చేస్తారా? ఇప్పుడేదో ఓ రూ. కోటి,రెండు కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారు. ఎన్నికల ముందే ఫౌండేషన్, ట్రస్టు పేర్లతో నేతలు హడావుడి చేస్తారు.

నాలుగేళ్ల పాటు ఈ ఫౌండేషన్, ట్రస్ట్ నేతలు ఏమయ్యారు? ఎన్నికల్లో పోటీ చేయడమంటే మాటలా? ఇలా ఫౌండేషన్లు, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలు పార్టీ కోసం ఏం చేస్తారు? ఎన్నికలు ముందు వస్తారు.. ఎన్నికలవగానే వెళ్లిపోతారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో ఇలాంటి నేతలు వస్తారు.

ప్రజల్లో ఉన్న నేతలకు.. గెలుస్తామనే ధీమా ఉన్న నేతలకు ఎవరొస్తే ఏంటీ? పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. భాష్యం ప్రవీణ్ కు.. చిలకలూరి పేటకు సంబంధమేంటీ? ప్రవీణ్ కు చిలకలూరిపేటలో ఓటే లేదు.

చిలకలూరిపేటలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేతకు చెప్పాను” అని అన్నారు. కాగా, కోడెల కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. కొడెల శివరాంకు ఎన్నికల ముందో తర్వాతో పార్టీ న్యాయం చేస్తుందని చెప్పారు.

Perni Nani : అన్నవరం కాకుండా చంద్రవరం అని పెట్టాల్సింది- పవన్ వారాహి యాత్రపై పేర్నినాని సెటైర్