AP PRC : పాత జీతాలే ఇవ్వాలి, అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది- పీఆర్సీ సాధన సమితి

ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలంటే పాత జీతాలే ఇవ్వాలని, అప్పుడే ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని పీఆర్సీ సాధన సమితి..

AP PRC : పాత జీతాలే ఇవ్వాలి, అప్పుడే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది- పీఆర్సీ సాధన సమితి

Ap Prc Employs

AP PRC : పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నిరూపించుకోవాలంటే ఉద్యోగులకు పాత జీతాలే ఇవ్వాలని, అప్పుడే ప్రభుత్వంపై తమకు నమ్మకం కలుగుతుందని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యమానికి సహకరిస్తున్న ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోందని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. పాత జీతమే ఇవ్వాలని ప్రతి ఉద్యోగి డీడీఓలు.. హెచ్ వో డీల వద్దకు వెళ్లి రాత పూర్వకంగా కోరాలని వెంకట్రామి రెడ్డి చెప్పారు. దీని నిమిత్తం ఓ ప్రోఫార్మా రూపొందించామన్నారు.

Richest Rich KID: తొమ్మిదేళ్ల కుర్రాడికి విలాసవంతమైన భవనం, ప్రైవేట్ జెట్, సూపర్ కార్స్

చర్చల విషయంలో మా డిమాండ్లేంటో ప్రభుత్వానికి తెలుసుని, మా ప్రతినిధి బృందం వచ్చి మా అభిప్రాయాన్ని చెప్పామని ఆయన తెలిపారు. మేం ఉద్యమ కార్యాచరణ ఇచ్చామని, మాతో కాకుండా వేరే ఉద్యోగ సంఘాలు ఎవరైనా వస్తే వారితో ప్రభుత్వం చర్చలు జరపొచ్చని, తమకు ఇబ్బందేమీ లేదని అన్నారు. వేరే ఉద్యోగ సంఘాలతో చర్చించుకుని కట్టడి చేయాలనుకుంటే చేసుకోవచ్చన్నారు.

పీఆర్సీ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి.. ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని సీఎస్ ని కోరామని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు అన్నారు. కానీ, సీఎస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీకి, మా స్టీరింగ్ కమిటీ బృందం వెళ్లి లేఖ ఇచ్చిందన్న ఆయన.. దానికీ ఇంతవరకు సమాధానం లేదన్నారు. సమాధానాలు చెప్పకుండా.. మమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. చర్చలకు వెళ్లాలని మాపై ఒత్తిడి తేవాలని ఉద్యోగులను సజ్జల రామకృష్ణా రెడ్డి కోరుతున్నారని.. సజ్జల చుట్టూ చర్చల కోసం మేం తిరగలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి అంశం పైన సజ్జల మాతో చర్చింది వాస్తవం కాదా..? అని నిలదీశారు. మధ్యంతర భృతిని వెనక్కి తీసుకుంది వాస్తవం కాదా..? అని బొప్పరాజు అడిగారు.

”మేం అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. మేం మెచ్యూర్డ్ గా వ్యవహరించ లేదని సజ్జల అంటారా..? మేం సజ్జలతో చర్చలు జరిపినప్పుడు.. మేం మెచ్యూర్డో.. ఇమ్ మెచ్యూర్డో తెలీదా..? ఇది చాలదన్నట్టు మరిన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామంటారా..? ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు..? మా ఉద్యోగులు మమ్మల్ని విమర్శిస్తున్నా.. సమస్య పరిష్కారం కోసం మేం చర్చలకు రాలేదా..? ఉద్యోగ సంఘాల నేతలను కించ పరచవద్దు. స్టీరింగ్ కమిటీ బృందం నేతలు కాదా..? మీతో చర్చలు జరపలేదా..?” అని బొప్పరాజు అన్నారు.

”చర్చల విషయంలో మేం అడిగిన డిమాండ్లపై ఇప్పటివరకు ఏ సమాధానం చెప్పలేదు. వీటికే సమాధానం చెప్పని ప్రభుత్వం.. పీఆర్సీ విషయంలో మా డిమాండ్లను నెరవేర్చుతుందనే నమ్మకం లేదు. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడను సక్సెస్ చేయాలని కోరుతున్నాం. ట్రెజరీ ఉద్యోగులు.. డీడీఓలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిది కాదు. మా ఉద్యమ కార్యాచరణలో భాగంగానే ట్రెజరీ ఉద్యోగులు జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడం లేదు. ట్రెజరీ ఉద్యోగులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకే పాత జీతాలే కావాలని ఉద్యోగులే కోరుతున్నారు” అని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస్ అన్నారు.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

”ఏపీలో అమలు చేయాలనుకుంటోంది ఏ పీఆర్సీ..? సీపీసీని అమలు చేస్తున్నారా..? అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను అమలు చేస్తున్నారా..? ఆఫీసర్స్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తున్నారా..? దేన్ని అమలు చేస్తున్నారో చెబితే మేం చర్చలకు సిద్దం. సీపీసీని అమలు చేస్తే.. అందులో ఉన్న మిగిలిన అంశాలనూ అమలు చేస్తారా..? ప్రభుత్వ కమిటీ మీద గౌరవం ఉంది కాబట్టే.. దారిన పోయే దానయ్యలను కాకుండా స్టీరింగ్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి పంపాం. ప్రభుత్వమే దారిన పోయే దానయ్యలతో చర్చిస్తామంటోంది. జీతాల్లో కోత లేకుంటే రికవరీ చేయాలని జీవోలో ఎందుకు పేర్కొన్నారో మెచ్యూర్టీ ఉన్న ప్రభుత్వ కమిటీ సభ్యులే చెప్పాలి.

ప్రతి డిపార్ట్ మెంటుకూ ప్రత్యేకంగా పే ఫిక్స్ చేస్తూ గతంలో జీవోలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ విధానానికి చెల్లు చిటీ చెప్పేశారా..? మెచ్యూర్టీ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ సంఘాలను అవమాన పర్చడమే. ఉద్యోగి అనుమతి లేకుండా కొత్త పే స్కేల్ అమలు చేయకూడదన్న సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి కొత్త పేస్కేల్ అమలు వద్దంటూ రాత పూర్వకంగా ఇస్తున్నాం” అని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ అన్నారు.