AP PRC : అడక్కుండానే ఎన్నో ఇచ్చారు.. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. మా డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు.

AP PRC : అడక్కుండానే ఎన్నో ఇచ్చారు.. సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

Prc Steering Committee

AP PRC : పీఆర్సీ అంశంలో మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం అర్థం చేసుకుందని స్టీరింగ్ కమిటీ సభ్యులు చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఈ క్రమంలో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని ప్రకటించారు.

”మంత్రుల కమిటీతో రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించామని పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్‌, సూర్యనారాయణ తెలిపారు. తమకు జరిగిన అన్యాయం గురించి సానుకూలంగా చర్చించామన్నారు. మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి సవివరంగా చర్చించామన్నారు. సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారని చెప్పారు. తమ చిన్న చిన్న మాటలను పట్టించుకోవద్దని సీఎంను కోరుతున్నామని తెలిపారు.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

”ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి మాకు మేలు చేశారు. మా డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు. సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. వేతన సవరణ విధానం మార్చుతామన్నారు. 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదరింది. సీఎంను కలిసి కృతజ్ఞతలు చెబుతాం. మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి సవివరంగా చర్చించాం” అని స్టీరింగ్ కమిటీ సభ్యులు చెప్పారు.

ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీ ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. అన్ని సంఘాల నేతలతో వివరంగా మాట్లాడామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఉద్యోగులు కోరిన పీఆర్సీ ఇవ్వలేకపోయామని చెప్పారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశంపై లోతుగా చర్చించామన్నారు.

ఉద్యోగులు, ప్రభుత్వం ఒక కుటుంబంలా ఉండాలన్నారు సజ్జల. ఉద్యోగులు సంతృప్తి చెందాలని సీఎం పదే పదే చెప్పారని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇస్తున్నామని, ఉద్యోగ సంఘాలు కోరినట్లు హెచ్‌ఆర్‌ఏ స్లాబుల్లో మార్పులు చేశామని వివరించారు. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు 24శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామన్నారు. ఐఆర్‌ రికవరీ ప్రతిపాదన ఉపసంహరిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

”ఇక నుంచి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ నివేదిక ఇస్తాం. సీసీఏ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాం. సీపీఎస్‌ సమస్యను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సీఎం కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపాం. ఆర్టీసీకి సంబంధించి కొన్ని జీవోలు ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన, ఇవ్వని అనేక హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చింది. జీతాలు పెంచడం వల్ల మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలిగింది. కరోనా వల్ల రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది” అని సజ్జల అన్నారు.