AP PRC : పీఆర్సీపై చర్చలు సఫలం..

ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు ఓకే చెప్పింది.

AP PRC : పీఆర్సీపై చర్చలు సఫలం..

Ap Prc Talks

AP PRC : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కాసేపట్లో సమ్మె విరమణపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రకటన చేయనుంది. మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పీఆర్సీ, ఇతర అంశాలపై సుమారు 7 గంటల పాటు సచివాలయంలోని రెండో బ్లాక్ లో చర్చలు జరిగాయి.

స్టీరింగ్ కమిటీ సభ్యులు.. సీఎం జగన్ తో వర్చువల్ గా మాట్లాడారు. మంత్రుల కమిటీ అంగీకరించిన డిమాండ్లపై ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒప్పంద పత్రాన్ని అధికారులు సీఎం జగన్ కు పంపారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. కాసేపట్లో మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు మీడియా ముందుకు రానున్నారు. సమ్మె విరమణపై స్టీరింగ్ కమిటీ ప్రకటన చేయనుంది.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

కాగా, ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు ఓకే చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామని తెలిపింది. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపుతామంది. HRA స్లాబుల్లో కనీసం 10 శాతం ఉండేలా మార్పుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అడిషనల్ క్వాoటమ్ ఆఫ్ పెన్షన్ లో కొత్త స్లాబులు. 70-74 ఏళ్ల వరకూ 7 శాతం, 75-79 ఏళ్ల వరకూ 14 శాతం అమలు.

నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. నిన్న, ఈరోజు కొన్ని గంటల పాటు స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం సాగింది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు… హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

కాగా హెచ్ఆర్ఏ శ్లాబులను కనీసం 12% నుంచి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా.. అది కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. దీంతో 10 శాతం, 12 శాతం, 16 శాతం శ్లాబులు నిర్ధారించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా.. మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.