కొక్కొరొకో : సంక్రాంతి కోళ్ల పందాలకు రెడీ

  • Published By: madhu ,Published On : January 13, 2020 / 04:15 AM IST
కొక్కొరొకో : సంక్రాంతి కోళ్ల పందాలకు రెడీ

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. రెండు రోజుల్లో పండుగ ఆనందంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీలో ఈ పండుగ వచ్చిందంటే..ముందుగా గుర్తుకొచ్చేది కోళ్ల పందాలు. బరి గీసి కోళ్లు ఢీ కొంటుంటే..ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. ఉత్కంఠ రేపే ఈ పందాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పందెంరాయుళ్లు దీక్షతో కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. పందాలు నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా..నిర్వాహకులు లైట్ తీసుకుంటున్నారు. 

ప్రధానంగా గోదావరి జిల్లాల్లో జరిగే పందాల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు తెరతీయడంతో ఏటా కోడి పందాల్లో రూ. కోట్లాది చేతులు మారనున్నాయి. ఈసారి మరింతగా పందాలు నిర్వహించేందుకు గోదావరి జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. 
ఖరీదైన కార్లు, డబ్బుల సంచులు, కోళ్ల పుంజులు, పొలాల్లో టెంట్లు, ఫ్లడ్ లైట్లు, విచ్చలవిడిగా మద్యం, మాంసాహారం, సేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు.

ప్రత్యేకంగా పుంజులను ఎంపిక చేస్తారు. ఒక్కో పుంజు రూ. 5 వేల నుంచి రూ. లక్షకు పైగా ధరలు పలుకుతుంటాయి. పోరాడి ఓడిన కోడి..కూరగా మారిపోతోంది. దీనిని తినడానికి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. చనిపోయిన కోడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కూర వండి..బంధు మిత్రులకు పంపించడం..ప్రజలు స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. 

కోళ్ల పందాలకు భీమవారం కేరాఫ్ అడ్రస్. పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ఇక్కడే వాలుతుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలతో పాటు పలువురు ప్రముఖుల దృష్టి భీమవరంపైనే ఉంటుంది. మూడు రోజుల పాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు. 

Read More : కాకినాడలో ఘర్షణలు : పవన్ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పోలీసులు