Gurukul Girls School : గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

చిత్తూరు జిల్లా పీలేరులోని జ్యోతిరావ్ పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. పాఠశాల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్ల బాలికలు ఫిర్యాదు చేశారు.

10TV Telugu News

Principal sexual harassment over Girls : చిత్తూరు జిల్లా పీలేరులోని జ్యోతిరావ్ పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో లైంగిక వేధింపుల కలకలం రేపాయి. బాలికల పట్ల పాఠశాల ప్రిన్సిపల్ ఓబులేశు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ప్రిన్సిపాల్ వ్యవహార శైలి గురించి ఇద్దరు బాలికలు తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పారు.

దీంతో లైంగిక వేధింపుల కలకలంతో కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. ప్రన్సిపల్ వ్యవహారంపై వారు మండిపడుతున్నారు. తమ పిల్లలకు రక్షణ లేదని…టీసీలు ఇస్తే తమ పిల్లలను తీసుకెళ్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్కూల్ ను తప్పపట్టాల్సిన పని లేదని.. మంచి స్కూలే.. కానీ ప్రిన్సిపల్ వచ్చాక వరస్ట్ అయిపోయిందని మండిపడ్డారు.

Notification : ఏపిలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

మరోవైపు ప్రిన్సిపల్ ఓబులేశు వేధింపులపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. జ్యోతిరావ్ పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సుమారు 500 మంది బాలికలు చదువుకుంటున్నారు.

కావాలనే కొందరు తనను ఇందులో ఇరికిస్తున్నారని ప్రిన్సిపల్ ఓబులేశు చెప్పారు. ఇక్కడి పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంతున్నానని అంటున్నారు. దీంతో ప్రిన్సిపాల్ ఓబులేశు వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.