అమరావతి గ్రామాల్లో టెన్షన్‌ : పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిన పలువురు మహిళలు

అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.

అమరావతి గ్రామాల్లో టెన్షన్‌ : పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి పడిన పలువురు మహిళలు

protest of women farmers : అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయ ఉద్యోగులను మహిళా రైతులు అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో మందడం జంక్షన్‌కు మహిళా రైతులు తరలివచ్చారు. ఉద్యోగులను అడ్డుకున్న మహిళలను పోలీసులు పక్కకు లాగిపడేశారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది.

ఈ తోపులాటలో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఉదయం అమరావతి నుంచి దుర్గమ్మ దర్శనానికి మహిళా రైతులు బయల్దేరారు. వారిని మందడం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగడంతో.. ఉద్రిక్తత కొనసాగుతోంది.

అంతకముందు సచివాలయ ముట్టడికి మహిళలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా భారీగా బలగాలను మోహరించారు. మొదటగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.

అయితే విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పి మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారు జామునుంచే రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మహిళా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అమరావతి గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.