ISRO : PSLV-C 52 ప్రయోగం విజయవంతం

1710 కిలోల బరువు గల ఆర్‌ఐ శాట్‌1 ఉప్రగహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేర్చింది. మొత్తం మూడు ఉప గ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది.

ISRO : PSLV-C 52 ప్రయోగం విజయవంతం

Pslvc

PSLV-C 52 rocket‌ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో కొత్త ఏడాదిలో మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ఛైర్మన్ డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయింది. PSLV-C 52 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలోని ఫస్ట్ లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఉదయం 5గంటల 59నిమిషాలకు నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌… మూడు ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా కక్ష్యలోకి చేర్చింది. మొత్తం 18 నిమిషాల 31 సెకన్లపాటు జరిగిన ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో.. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

PSLV-C 52 రాకెట్‌… ఆర్‌ఐ శాట్‌1తోపాటు.. భారత్‌, భూటాన్‌ కలిసి రూపొందించిన 17.5 కిలోల INS-2TD… విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేసిన 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. 1710 కిలోల బరువు గల ఆర్‌ఐ శాట్‌1 ఉప్రగహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేర్చింది. మొత్తం మూడు ఉప గ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. ఇందులో తిరువనంతపురం విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలు ఉన్నాయి.

CM KCR : త్వరలో కొత్త జాతీయ పార్టీ..!-కేసీఆర్ సంచలనం

INS-2TD అనేది భారతదేశం-భూటాన్ జాయింట్ శాటిలైట్. వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై ఉండే తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం ESO-04 రాకెట్‌ను ప్రయోగించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమే EOS-04 అని ఇస్రో తెలిపింది. ఈ ఏడాదిలో మరో మూడు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇందులో చంద్రయాన్‌-3 కూడా ఉంటుందని ఇస్రో తెలిపింది.