ISRO : PSLV C-55 రాకెట్ ప్రయోగం విజయవంతం..

వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోతోంది.తాజాగా ఇస్రో చేపట్టిన PSLV C-55 ప్రయోగజం విజయవంతమైంది. దీంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. PSLV C-55 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.

ISRO : PSLV C-55 రాకెట్  ప్రయోగం విజయవంతం..

ISRO PSLV - C 55 successfull

ISRO PSLV C-55 : వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోతోంది.తాజాగా ఇస్రో చేపట్టిన PSLV C-55 ప్రయోగజం విజయవంతమైంది. దీంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. PSLV C-55 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూరనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి దాదాపు 26 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత PSLV C-55 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌.. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎస్టీ ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన ఈ రాకెట్ వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీని అందించగలుగుతుంది.

టెలియోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి చెందినది కాగా.. దీనిని వివిధ ఏజెన్సీల అవసరాలకు వినియోగించనున్నారు. లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కలిసి అభివృద్ధి చేశాయి. సింగపూర్‌ ఇ-నావిగేషన్‌ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్‌ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చనుంది. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే.. ఇస్రో మరో రాకెట్‌ ప్రయోగించడం ద్వారా సరికొత్త రికార్డును సొంతం చేసుకోటం గర్వించాల్సిన విషయం.