పబ్జీ గేమ్..ఉరి వేసుకున్న ఇంటర్ విద్యార్థి

  • Published By: madhu ,Published On : October 11, 2020 / 08:41 AM IST
పబ్జీ గేమ్..ఉరి వేసుకున్న ఇంటర్ విద్యార్థి

pubg game : పబ్జీ గేమ్ మరొకరి ప్రాణాలు తీసింది. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థి తేజేస్ పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు. బీటీఆర్ పురంలో తేజేస్ కుటుంబం నివాసం ఉంటోంది. 2020, అక్టోబర్ 10వ తేదీ శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని విగత జీవుడిగా కనిపించాడు.



దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లవారుజాము వరకు పబ్జీ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.
సూసైడ్ చేసుకునే ధైర్యం తేజస్ కు లేదని కుటుంబసభ్యులు అంటున్నారు.



పబ్జీ గేమ్ ఆడుతున్నాడని తెలుసని, కానీ ఇలా అవుతుందని ఊహించలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. పబ్జీ గేమ్ తో మానసికంగా కృంగిపోయి ఉంటాడని అనుకుంటున్నామని తెలిపారు.



పబ్జీ గేమ్ ను కేంద్రం బ్యాన్ చేసినా..ఏదో ఒక విధంగా డౌన్ లోడ్ చేసుకుంటున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు రోదన వర్ణనాతీతంగా ఉంది.