Tirumala Pushpa Yagam : నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

Tirumala Pushpa Yagam : నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు

pushpa yagam in tirumala

Tirumala Pushpa Yagam : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు.

సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పుష్పయాగం సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను దేవస్థానం రద్దు చేసింది. పుష్పయాగ మహోత్సవానికి సోమవారం రాత్రి శ్రీవారి ఆలయంలో అంకురార్పరణ చేశారు.

TTD Slotted Free Darshan Tokens : తిరుపతిలో స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్లు జారీ ప్రారంభం

మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన విష్వక్సేనుల వారిని ఆల‌యం నుంచి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ మృత్సంగ్రహ‌ణం, ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9 గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.